Trending news

Yadagirigutta Temple Board: టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట కు టెంపుల్ బోర్డు..

[ad_1]

  • తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు..

  • ఆలయ బోర్డును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం..
Yadagirigutta Temple Board: టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట కు టెంపుల్ బోర్డు..

Yadagirigutta Temple Board: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. యాదగిరిగుట్ట బోర్డుకు టీటీడీ తరహాలో స్వయంప్రతిపత్తి, విధివిధానాలు ఉండేలా అవసరమైతే చట్టాన్ని సవరించాలన్నారు. యాదగిరిగుట్ట రాజగోపురానికి బంగారు తాపడం పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు చాలా వరకు అసంపూర్తిగా ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. అలా ఆపలేరని, కొనసాగించక తప్పదని స్పష్టం చేశారు. యాదగిరిగుట్టలో ఇప్పటివరకు ఏయే అభివృద్ధి పనులు జరిగాయి, అసంపూర్తిగా ఉన్న వాటిపై సమగ్ర నివేదికను వారం రోజుల్లో అందించాలని సీఎం ఆదేశించారు.

Read also: Women’s Waist : పెళ్లి తర్వాత ఆడవాళ్ల నడుము ఎందుకు పెరుగుతుందో తెలుసా ?

యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు సౌకర్యాలు, కాటేజీల నిర్మాణానికి దాతలు, కార్పొరేట్ సంస్థలను తీసుకెళ్లాలి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని యాదగిరిగుట్టను మెరుగుపరచాలని ముఖ్యమంత్రి అన్నారు. మరోవైపు కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయాన్ని రామప్పగుడి ఆకారంలో అద్భుతంగా పునర్నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ వెలుపల దాదాపు వెయ్యి ఎకరాల్లో కొత్త జూ పార్క్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. వివిధ ప్రాంతాల నుంచి జంతువులు, పక్షులను తీసుకురావాలని చెప్పారు. అనంత్ అంబానీ జామ్‌నగర్‌లో 3000 ఎకరాల్లో వనతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని సీఎం ప్రస్తావించారు. ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, సంస్థలను ఆహ్వానించాలని అధికారులకు సూచించారు.
Nani : సెప్టెంబరు 5న ముహూర్తానికి నేచురల్ స్టార్ రెడీ.. దర్శకుడు ఇతనే..



[ad_2]

Related Articles

Back to top button
Close
Close