Weather Update: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

[ad_1]
- బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
- తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన
- తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్ జారీ

Weather Update: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు, దక్షిణ ఒడిశాతో పాటు తెలంగాణ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి బలమైన గాలులు వీయనున్నాయి. సముద్రంలో భారీగా అలలు వస్తాయని, మత్స్యకారుల వేటపై నిషేధం విధించారు. ఎవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
Read Also: Chit fund Fraud: రూ.10 కోట్ల చీటీల సొమ్ముతో పరార్.. ఆందోళన చేపట్టిన బాధితులు
అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నాలుగు రోజులపాటు రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. నేడు తేలికపాటి నుంచి మోస్తరు.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. రేపు భారీ వర్షాలు కురిసే సూచన ఉండటంతో రాష్ట్రానికి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రేపు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది.
[ad_2]