Trending news

Weather Update: తీరం దాటిన వాయుగుండం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

[ad_1]

  • తీరం దాటిన వాయుగుండం
  • అర్ధరాత్రి 12.30-2.30 గంటల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటిన వాయుగుండం
  • ఏపీ.. తెలంగాణలో భారీ వర్షాలు
Weather Update: తీరం దాటిన వాయుగుండం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

Weather Update: వాయుగుండం ఆదివారం అర్ధరాత్రి 12.30-2.30 గంటల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం వాయుగుండం వాయవ్యంగా పయనిస్తోంది. ఉత్తరాంధ్ర మీద ఆవరించి బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలోనూ అనేక చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఆదివారం చాలా చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విశాఖ, అనకాపల్లి, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాలు, వైఎస్‌ఆర్‌, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడనున్నట్లు పేర్కొన్నారు.

Read Also: Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ



[ad_2]

Related Articles

Back to top button
Close
Close