Weather Alert: గుజరాత్ సమీపంలో తీవ్ర అల్పపీడనం.. 6 గంటల్లో తుఫాన్‌గా మారే ఛాన్స్

[ad_1]
- గుజరాత్ సమీపంలో తీవ్ర అల్పపీడనం
-
6 గంటల్లో తుఫాన్‌గా మారే ఛాన్స్ -
బంగాళాఖాతంలో కూడా మరో తీవ్ర అల్పపీడనం -
ఆంధ్రప్రదేశ్.. ఒడిశాలో వర్షాలు కురిసే ఛాన్స్

ఆరేబియా సముద్రంలో మరో ఆరు గంటల్లో తుఫాన్ ఏర్పడబోతుందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. కచ్ తీరం మరియు ఈశాన్య ఆరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని.. అది కాస్తా 6 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ప్రస్తుతం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుందని.. రెండు రోజుల్లో తీరం దాటనుందని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: S Jaishankar: పాకిస్తాన్‌తో చర్చలపై జైశంకర్ బిగ్ స్టేట్‌మెంట్..
తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రాలను ఐఎండీ అలర్ట్ చేసింది. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇళ్లు, రోడ్లు ఏకమైపోయాయి. అలాగే నదుల్లోంచి మొసళ్లు జనావాసాల మధ్యకు వచ్చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Mamata Banerjee: మీ నుంచి ఎలాంటి స్పందన లేదు? మరోసారి ప్రధాని మోడీకి సీఎం మమతా బెనర్జీ లేఖ
అలాగే ఉత్తర బంగాళాఖాతంలో కూడా రెండో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరం వైపు కదులుతోందని అంచనా వేశారు. ఇది రాబోయే 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీరం దాటే సమయంలో ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వాస్తవానికి ఆగస్టు, అక్టోబర్‌లో సహజంగా తుఫాన్లు ఏర్పడడం సాధారణ విషయమే.
[ad_2]