Trending news

Watch: హమ్మయ్యా.. ప్రకాశం బ్యారేజీ గేట్లు సేఫ్.. కన్నయ్య నాయుడు ఏమన్నారంటే..?

[ad_1]

భారీ వరదల కారణంగా ప్రకాశం బ్యారేజీ గేట్లకు ముప్పు ఏర్పడింది. సోమవారంనాడు ఎగువ నుంచి కొట్టుకువచ్చిన ఐదు పడవలు..బ్యారేజీ గేట్లకు అడ్డుపడ్డాయి. వాటిలో ఒకటి వరద ధాటికి దిగువ ప్రాంతానికి కొట్టుకుపోగా..ఇంకా మూడు పడవలు అక్కడే ఉన్నాయి. వాటిలో ఒకటి గేట్ల కిందిభాగంలో చిక్కుకుంది. బ్యారేజ్‌ను పడవ బలంగా ఢీకొట్టడంతో గేటు కౌంటర్‌ వెయిట్‌ ధ్వంసమైంది. దీంతో మరమ్మతుపై దృష్టిపెట్టిన ప్రభుత్వం..ఇటీవల తుంగభద్ర జలాశయానికి స్టాప్‌లాక్‌ ఏర్పాటు చేసిన సీనియర్‌ ఇంజినీరు కన్నయ్యనాయుడిని విజయవాడ పిలిపించింది. పడవలు అడ్డుపడటంతో ప్రకాశం బ్యారేజీ గేట్లకు ఏర్పడిన నష్టంపై ఆయన నేరుగా పరిశీలించారు. కన్నయ్య నాయుడు సూచనలతో పిల్లర్, గేట్స్ రిపేర్ చేపట్టింది ప్రభుత్వం.

బోటు ప్రమాదంతో బ్యారేజ్‌కు ఎలాంటి డ్యామేజ్‌ జరగలేదని..కౌంటర్‌ వెయిట్‌ మాత్రమే ధ్వంసమయిందని కన్నయ్య నాయుడు తెలిపారు. ఒక గేటుకు మాత్రమే బోటు తగిలిందని తెలిపారు. ఒక్క గేటుకే సమస్య ఏర్పడినందున మిగిలిన గేట్లు ఎత్తేందుకు ఎలాంటి సమస్యా లేదన్నారు.

[ad_2]

Related Articles

Back to top button
Close
Close