Watch: కారు పార్కింగ్ కోసం పెద్ద యుద్ధమే చేశారు.. మరీ ఇంత అవసరమా.. వైరల్ వీడియో

[ad_1]
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి.. తాజాగా.. రెండు కుటుంబాల గొడవకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.. దీనిలో కారు పార్కింగ్ విషయంలో రెండు కుటుంబాలు ఘర్షణ పడ్డాయి.. చూస్తుండగానే ఈ వివాదం హింసాత్మకంగా మారింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడా సెక్టార్ 72లోని బి బ్లాక్‌లో చోటుచేసుకుంది.. కారు పార్కింగ్ విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు.
నోయిడాలోని సెక్టార్ 72లో సోమవారం సాయంత్రం పార్కింగ్ వివాదం రెండు కుటుంబాల మధ్య హింసాత్మకంగా మారినట్లు తెలిపారు. చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారి హింసాత్మకం అయినట్లు తెలిపారు. దీంతో ఓ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు అక్కడ పార్క్ చేసిన మరో కుటుంబానికి సంబంధించిన కారును ధ్వంసం చేశారు. అంతేకాకుండా.. ఆ కుటుంబంపై దాడి కూడా చేశారు.. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు.
అయితే.. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పార్కింగ్ విషయంలో మరి ఇంత దారుణంగా వ్యవహరించడం ఏంటి ..? అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వీడియో చూడండి..
Why are people becoming so violent nowadays? Is this rage worth it? What do you think?
📍Sector 72, Noida
a parking dispute turned violent between Rajiv Chauhan and Nitin, leading to a brutal clash. Nitin allegedly attacked Rajiv with bats and sticks, damaging his car. In… pic.twitter.com/G7gjV1EISC— Akassh Ashok Gupta (@peepoye_) August 27, 2024
అరెస్టయిన వారిలో ఇద్దరు మహిళలు, ఒక మైనర్ కూడా ఉన్నారు. ఆగస్టు 26 సాయంత్రం సెక్టార్ 72లోని బి బ్లాక్‌లో పార్కింగ్ స్థలం విషయంలో ఇరువర్గాలు వాగ్వాదానికి దిగడంతో ఘర్షణ మొదలైనట్లు పోలీసులు తెలిపారు. వీడియోలోని వ్యక్తులు తమ పొరుగింటి వారిని తిట్టడం, కారు ధ్వంసం చేయడం, దాడి చేయడం చూడవచ్చు.. ఇద్దరు వ్యక్తులు క్రికెట్ బ్యాట్‌లు, కర్రలతో విధ్వంస సృష్టించారు.
ఈ ఘటనపై ఇరు కుటుంబాలపై నోయిడాలోని సెక్టార్ 113 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.. హింసాత్మక ఘర్షణకు పాల్పడిన ఇరువర్గాలపై పోలీసు అధికారులు కేసులు నమోదు చేశారని.. విచారణ జరుగుతోందని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
[ad_2]
Source link