Trending news

Viral Video: రోడ్డుపై యువతిని వేధించిన ఆకతాయి.. అటుగా వచ్చిన బస్సు ఆగడంతో దుమ్ముదుమారం! వీడియో

[ad_1]

ఎన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చినా.. ఎందరినీ శిక్షించినా.. దేశంలో నిత్యం ఏదోకమూల అమ్మాయిలపై అగాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అపాయంలో ఉన్న అమ్మాయిలను ప్రతీ చోట, ప్రతీసారి ఎవరో ఒకరు వచ్చి కాపాడలేని పరిస్థితి. దీంతో ఎందరో అడపిల్లల జీవితాలు రాలిపోతున్నాయి. తాజాగా పట్టపగలు.. నడిరోడ్డుపై ఓ ఆకతాయి రోడ్డుపై వెళ్తున్న యువతి వెంటపడటమేకాకుండా ఆమెను కొడుతూ.. చిత్రహింసలు పెట్టసాగాడు. పైగా అది నిర్మానుష్య ప్రదేశం కావడంతో జనసంచారం కూడా తక్కువగా ఉంది. ఇదే అదనుగా సదరు ఆకతాయి మరింత రెచ్చిపోయాడు. అయితే ఇంతలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. అటుగా వచ్చిన ఓ బస్సు ఉన్నట్లుండి ఆగడంతో అందులోని ప్రయాణికులు దిగొచ్చి.. సదరు ఆకతాయిని చితక్కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో ఓ వ్యక్తి యువతిని వేధించడం, శారీరకంగా దాడి చేయడం కనిపిస్తుంది. అదే రోడ్డుపై వెళ్తున్న ఓ బస్సులోని ప్రయాణికులు గమనించడంతో ఈ ఘటనలో మలుపు చోటు చేసుకుంది. అంతే.. మెరుపు వేగంతో బస్సు ఆపు చేయించారు. అనంతరం బస్సులోని ప్రయాణికులు అప్రమత్తమై యువతిని వేధిస్తున్న వ్యక్తిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రయాణీకులు ధైర్యంతో జోక్యం చేసుకోవడంతో నిందితుడి బారీ నుంచి యువతిని కాపాడగలిగారు. రోడ్డుపై ఉన్న ఓ సీసీటీవీ ఫుటేజీలో ఇందుకు సంబంధించిన దృశ్యాలు రికార్డు కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఇలాంటి ఘటనలు ఎదుర్కోవడం కేవలం వ్యక్తిగత కర్తవ్యం మాత్రమే కాదని, సామాజిక బాధ్యతని ఈ సంఘటన నిరూపిస్తుంది. మన చుట్టూ ఎక్కడైనా ఇలాంటి దుశ్చర్యలకు ఎవరైనా పాల్పడితే.. ఇదే మాదిరి వ్యక్తులు సంఘీభావం, ధైర్యసాహసాలు చూపాలని, తద్వారా మన కుటుంబాల్లోని ఆడపిల్లలను కాపాడగలుగుతామని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. రేపటి సమాజం కోసం ఇలాంటి మార్పు ఎంతైనా అవసరం. మాకెందుకులే అని ఫోన్లు పట్టుకుని వీడియోలు తీస్తూ.. ప్రేక్షకపాత్ర పోషిస్తే ఇదే పరిస్థితి రేపు నీ ఇంటి వరకూ వస్తుంది. అప్పుడు కాపాడేందుకు ఎవ్వరూ ముందుకురారు..!

మరిన్ని ట్రెండింగ్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close