Viral post: ఆఫీస్ నుంచి “ఒక నిమిషం” ముందు వెళ్లిపోయినందుకు నోటీసులు.. వైరల్ అవుతున్న పోస్ట్..

[ad_1]
- ఒక నిమిషం ముందు వెళ్లినందుకు బాస్ నుంచి నోటీసులు..
-
వైరల్ అవుతున్న ఉద్యోగి పోస్ట్.. -
యజమాని తీరును తప్పుపట్టిన పలువురు నెటిజన్లు..

Viral post: ఆఫీస్ నుంచి ఒక నిమిషం ముందు వెళ్లినందుకు ఉద్యోగిని అతని బాస్ మందలించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాయంత్రం 5 గంటలకు బదులు 4.59 గంటలకు ఆఫీస్ నుంచి వెళ్లిన వర్కర్‌కి అతని బాస్ నోటీసులు అందించారు. ఇటీవల దీని గురించి సదరు ఉద్యోగి రెడ్డిట్‌లో పోస్ట్ చేశాడు. దీనిపై తన యజమాని మందలించినట్లు నివేదించాడు. ఇది ఉద్యోగుల్లో విస్తృత చర్చకు దారి తీసింది. కొందరు యజమాని తీరును విమర్శిస్తూ పోస్టులు పెట్టారు.
Read Also: PM Modi On Global Fintech: ఫిన్‌టెక్‌ల కోసం కేంద్రం పలు చర్యలు తీసుకుంటుంది..
పోస్ట్‌లో, ఒక ఉద్యోగి చాలా సార్లు తన షిఫ్ట్ అధికారికంగా ముగియడానికి ఒక నిమిషం ముందు ఆఫీస్ నుంచి వెళ్లడాన్ని ప్రస్తావించారు. దీని కారణంగా అతని యజమాని, ఉద్యోగికి నోటీసులు ఇచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో పలువురు స్పందించారు. కఠినమైన పని గంటల విధానం ఉద్యోగి మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ని దెబ్బతిస్తుందని ఓ నెటిజన్ చెప్పారు. మరో వ్యక్తి తన యజమానికి ముందుగానే చెప్పినప్పటికీ, ఒక అనివార్యమైన ప్రమాదం కారణంగా ఆలస్యంగా వచ్చినందుకు జరిమానా విధించిన విషయాన్ని పంచుకున్నారు. కొన్ని నిమిషాలు మాత్రమే ఆలస్యమైనప్పటికీ సగం వేతనాన్ని కోల్పోవడాన్ని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో సమయం కన్నా ఎక్కువ సేపు పని చేయకూడదనే నిబంధనలకు కూడా కట్టుబడి ఉండాలని సూచించారు.
నిమిషం ముందు వెళ్లడాన్ని ప్రస్తావించిన మరో వ్యక్తి..‘‘నేను ఒక పెద్ద హెల్త్ కేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఒక వేళ మీ రోజు 8 గంటలకు ప్రారంభమైతే ఇన్-పంచ్ 7.57 నుంచి 8.00 గంటల మధ్య ఉండాలి. 8.01 వద్ద ఉంటే మీరు మేనేజ్‌మెంట్ నుంచి నోటీసులు అందుకుంటారు. వారు ఇలా వందల మందికి చేస్తున్నారు’’ అని అతనను చెప్పారు.
[ad_2]