Trending news

Viral: కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!

[ad_1]

ఇటీవల ఆ ప్రాంతంలో ఒక భారీ మర్రి చెట్టు కూలిపోయింది. ఆ ప్రాంతానికి వెళ్లిన నౌగూడ నివాసి సమీర్‌ మెటల్ డిటెక్టర్ ఉపయోగించి చెట్టు కింద శివలింగం ఉండటాన్ని గమనించాడు. విషయాన్ని గ్రామస్థులకు తెలియజేయడంతో.. వారు కొన్ని మీటర్ల లోతు వరకు మట్టిని తవ్వి భూమి కింద ఉన్న శివలింగాన్ని వెలికితీశారు. ఈ అద్భుత ఆవిష్కరణను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో నౌగూడ గ్రామానికి పోటెత్తారు. ఇది కార్తీక మాసం కావడంతో శివయ్య దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. బయల్పడిన శివలింగం దగ్గర నిత్యం పూజలు జరుగుతున్నాయి. స్థానికులు అక్కడ చిన్న పందిరి ఏర్పాటు చేశారు. భక్తులకు ప్రసాదాలు అందజేస్తున్నారు. శివలింగ దర్శనానంతరం భక్తులు గ్రామస్తుల ఏర్పాట్లను మెచ్చుకుంటున్నారు. మరోవైపు, శివలింగం బయల్పడిన ఆ ప్రాంతంలో గుడి కట్టాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

[ad_2]

Related Articles

Back to top button
Close
Close