Trending news

Viral: కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా.?

[ad_1]

బిడ్డ పుట్టగానే తల్లి తన కష్టాన్నంతా మర్చిపోతుంది. అప్పటినుంచి తమ బిడ్డే సర్వంగా భావించి బ్రతుకుతారు తల్లిదండ్రులు. అదే బిడ్డలు పెరిగి పెద్దవారైన తర్వాత తల్లిదండ్రులు వారికి అడ్డుగా భావిస్తారు. నిలువ నీడ లేకుండా చేసి రోడ్డుపాలు చేస్తారు. అలాంటి ఎన్నో ఘటనలు మనం చూశాం. తాజాగా కరీంనగర్‌ జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. ఆస్తులు పంచుకున్న అన్నదమ్ములు కన్నతల్లికి పట్టెడన్నం పెట్టడానికి కూడా ఇష్టపడటం లేదు. తమ ఇంటిలోకూడా ఉండనివ్వడంలేదు. జీవితం చరమాంకంలో ఉన్న ఆతల్లి తన గోడును ఎవరితో చెప్పుకోవాలి. గ్రామస్తుల సలహాతో ఓవైపు మనసు ఒప్పుకోకపోయినా పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కింది. తనకు న్యాయం చేయాలని వేడుకొంది.

పేగు బంధం తెంచుకుని పుట్టిన బిడ్డలు కన్నతల్లికి బుక్కెడన్నం పెట్టడం లేదు. ఆస్తులుపంచుకునే వరకు వారసులం కానీ అమ్మను చూసుకునేందుకు కాదని అంటున్నారు… గుడిసెలో ఉంటున్న తన గురించి పట్టించుకోవడం లేదని ఓ వృద్దురాలు పోలీసులను ఆశ్రయించింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరుకు చెందిన నరసవ్వ దీనస్థితి కంటతడి పెట్టిస్తోంది. నలుగురు కొడుకులు ఉండీ గ్రామస్తుల దయాదాక్షిణ్యాలపై పూరి గుడిసెలో బ్రతుకునీడిస్తోంది.

కడుపున పుట్టిన నలుగురు కొడుకులను ఓ ఇంటి వాళ్లను చేసి, ఆస్తులు పంచి ఇచ్చింది. నలుగురికి నాలుగు ఇళ్లు కట్టించి ఓ ఇంటివారిని చేసింది. పంపకాలు చేసి ప్రయోజకులను చేసింది నరసవ్వ. తన బిడ్డలకోసం అహర్నిశలు పాటుపడిన నరసవ్వ వృద్దాప్యానికి చేరుకునే సరికి కన్నబిడ్డలు చేరనివ్వడంలేదు. ఆమె ఓ చిన్న గుడిసెలో తల దాచుకుంటూ జీవనం సాగిస్తోంది. చేతులు వణుకుతూ… ఊత కర్ర సాయంతో నడుస్తున్న తనకు అన్నం కూడా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన బిడ్డలు తనను పట్టించుకోవడంలేదని, తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. ఎల్ఎండీ ఎస్సై చేరాలను కలిసిన నరసవ్వ తన గోడు వెల్లబోసుకోవడంతో ఆమెకు అండగా నిలుస్తామని చెప్పారు. తల్లి పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం సరికాదని వారికి నచ్చచెప్తామని నరసవ్వకు ఎస్సై మాట ఇచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

[ad_2]

Related Articles

Back to top button
Close
Close