Trending news

Vinayaka Chavithi: వినాయక చవితి రోజున పొరపాటున చంద్రుడిని చూస్తే భయపడకండి.. దోష నివారణకు ఈ మంత్రాన్ని పఠించండి

[ad_1]

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగలలో ఒకటి వినాయక చవితి. మరో రెండు రోజుల్లో శ్రావణ మాసం ముగిసి భాద్రపద మాసంలో అడుగు పెట్టనున్నాం. ఈ నేపధ్యంలో వినాయక చవితి సందడి ఇప్పుడే మొదలైపోయింది. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఘనంగా జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది వినాయక చవితి పండుగ 7వ తేదీ సెప్టెంబర్ 2024న జరుపుకోనున్నారు. ఈ రోజున ప్రజలు గణపతిని పూజిస్తారు. ఇళ్ళలో మాత్రమే కాదు అనేక చోట మండపాల్లో కూడా వినాయక విగ్రహాన్ని కూడా ప్రతిష్టించి పుజిస్తారు. వినాయక చవితిని గణపతి జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. అయితే ఈ వినాయక చవితి పండగ గురించి ఒక నమ్మకం కూడా ఉంది. అదేమిటంటే చవితి రోజున పొరపాటున కూడా చంద్రుడిని చూడవద్దు అనేది. ఒకవేళ వినాయక చవితి రోజున ఎవరైనా పొరపాటున చంద్రుడిని చూస్తే అది చాలా అశుభంగా భావించబడుతుంది. కనుక చంద్రుడిని చూడకూడదని చెబుతారు. అయితే తెలిసి తెలియక చవితి రోజున చంద్రుడిని చూస్తే దానికి కూడా పురాణాలు పరిష్కారం చూపించాయి.

వినాయక చవితి రోజున చంద్రుడిని ఎందుకు చూడకూడదు?

వినాయక చవితి రోజున చంద్రుడిని చూడటం అశుభం. ఇలా చూడడం వలన నీలాపనిందలకు గురి కావాల్సి ఉంటుందని నమ్మకం. చేయని పనికి తప్పుకి మాటలు పడాల్సి ఉంటుంది. కనుక ఈ తప్పుడు ఆరోపణల బారిన పడకుండా ఉండడం కోసం వినాయక చవితి రోజున చంద్రుడిని చూడటం నిషేధించబడింది. ఇలా చూస్తే జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. ఎవరినా సరే తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

దీని వెనుక ఉన్న నమ్మకం ఏమిటి?

వినాయకుడు, అతని వాహనం ఎలుకకు సంబంధించిన ఒక పురాణ కథ కూడా ఉంది. నిజానికి ఒకసారి గణేశుడు ఎలుకపై స్వారీ చేస్తూ తన ఇంటి నుండి బయటకు వచ్చాడు. అయితే వినాయకుడు అధిక బరువు కారణంగా అతను తడబడ్డాడు. అలా తబడుతున్న వినాయకుడిని శివుడి శిగలో ఉన్న చంద్రుడు చూసి నవ్వడం మొదలుపెట్టాడు. దీంతో వినాయకుడికి కోపం వచ్చింది. అప్పుడు ఎవరైనా చంద్రుడిని చూస్తే చేయని తప్పుకి కూడా నిందలు ఎదుర్కోవాల్సి ఉంటుందని శపించాడు. అయితే దేవతల కోరికతో తాను ఇచ్చిన శాపాన్ని మార్పు చేస్తూ భాద్రపద మాసం శుక్ల చతుర్థిలో ఎవరైనా రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తే సమాజంలో అవమానాలు, నిందలను ఎదుర్కోవలసి వస్తుందని గణేశుడు చంద్రుడిని శపించాడు. అంతే కాకుండా అలాంటి వారు చేయని తప్పుకు నిందలు ఎదుర్కోవడమే కాదు తప్పుడు ఆరోపణలు, సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

శ్రీ కృష్ణుడు కూడా బాధితుడే

ద్వాపర యుగంలో ఒకసారి శ్రీకృష్ణుడు శ్యమంతక మణి అనే రత్నాన్ని దొంగిలించాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దీనికి కారణం శ్రీ కృష్ణుడు గణేష్ చతుర్థి పండగ రోజు పాల గ్లాస్ లో కనిపిస్తున్న చంద్రుడిని చూశాడు. దీంతో కన్నయ్య కూడా వినాయకుడి ఇచ్చిన శాపం నుండి విముక్తి పొందలేకపోయాడు. అప్పుడు నారదుడు అతనికి ఈ కథ చెప్పాడు.

చంద్రుడిని చూస్తే.. ఈ చర్యలు తీసుకోండి

అయితే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఎవరైనా పొరపాటునైనా వినాయక చవితి రోజున చంద్రుడిని చూసినట్లయితే కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా నీలాప నిందల నుంచి బయటపడవచ్చు. చవితి రోజున ఉపవాసం చేయడం మాత్రమే కాదు వినాయక వ్రత కథను చదివి.. అప్పుడు ఆ కథ అక్షతలను తీసుకుని తలపై వేసుకోవడం ద్వారా చంద్ర దర్శన దోషం నుండి విముక్తి పొందవచ్చు. అంతేకాదు ఒక మంత్రాన్ని పఠించడం ద్వారా కూడా ఈ దోషం నుండి విముక్తి పొందవచ్చు.

చదవాల్సిన మంత్రం

సింహః ప్రసేన మవదీత్, సింహో జాంబవంతాహతః, సుకుమారక మారోధి, స్తవహ్యేశ స్యమంతకః(सिंहः प्रसेनमवधीतसिंहो जाम्बवता हतः। सुकुमारक मरोदिस्तव ह्येषा स्यामंतकः॥)

ఎవరైనా పొరపాటున చవితి రోజున చంద్రుడిని చూస్తే ఈ మంత్రాన్ని నిర్మలమైన హృదయంతో చదవడం వలన అనేక ప్రయోజనాలు పొందుతారు. అంతేకాదు చంద్ర దోషం నుంచి విముక్తి పొందుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

[ad_2]

Related Articles

Back to top button
Close
Close