Trending news

Vijayawada Crime: పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. గంటల వ్యవధిలో ఇద్దరు మృతి

[ad_1]

  • పుట్టిన రోజు వేడుకల్లో విషాదం..

  • గంటల వ్యవధిలోనే ఇద్దరు మృతి..

  • విజయవాడలో ఘటన..
Vijayawada Crime: పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. గంటల వ్యవధిలో ఇద్దరు మృతి

Vijayawada Crime: ఉత్సాహంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.. కానీ, ఆ పుట్టిన రోజు వేడుకలకు గంటల వ్యవధిలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన విజయవాడలో విషాదంగా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భవనీపురంలో నివాసం ఉంటున్న ఖాజా మహమ్మద్ (33) .. తన ఇద్దరు కవల పిల్లలకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాడు.. ఇక, పిల్లల రెండవ పుట్టినరోజు వేడుకలకు కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించాడు కాజా మహమ్మద్.. కుటుంబ సభ్యులందరితో కలిసి ఆదివారం బర్త్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించాడు.. కానీ, రాత్రి 11 గంటల సమయంలో నిద్రపోవడానికి వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు ఖాజా మహమ్మద్.. మరోవైపు.. ఆదివారం పుట్టిన రోజు వేడుకలకు హాజరైన గంగూరులో ఉండే ఖాజా మహమ్మద్ పిన్ని జరీనా బేగం కూడా హాజరయ్యారు.. ఆమె వయస్సు 46 సంవత్సరాలు.. అక్క కొడుకు చనిపోయిన వార్త తెలుసుకొని చూడడానికి ఇచ్చిన ఆమె.. ఒక్కసారిగా ఖాజా మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయారు.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే జరీనా బేగం మరణించినట్టు వైద్యులు తెలిపారు.. అయితే, గంటల వ్యవధిలోనే ఇద్దరు మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లింది.. ఉత్సాహంగా కవలల పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన గంటల వ్యవధిలోనే ఇద్దరు మృతచెందడతో.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు..

Read Also: KL Rahul-LSG: ఊహాగానాలకు చెక్‌.. లక్నోతోనే కేఎల్ రాహుల్!



[ad_2]

Source link

Related Articles

Back to top button
Close
Close