Venezuela: తీవ్ర విద్యుత్ సంక్షోభం .. అంధకారంలో వెనుజువెలా

[ad_1]
- తీవ్ర విద్యుత్ సంక్షోభం దిశగా వెనుజువెలా
-
రాజధాని కారాకస్‌తో పాటు దాదాపు 24 రాష్ట్రాల్లో చీకటి

వెనుజువెలా అత్యంత విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వెనుజువెలా రాజధాని కారాకస్‌తో పాటు దాదాపు 24 రాష్ట్రాల్లో తెల్లవారుజాము నుంచి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వెనుజువెలాలో అనేక ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రాజధాని కారాకస్‌తో పాటు అనేక రాష్ట్రాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి కరెంటు సమస్య తలెత్తింది. ఉదయం 4.50 నుంచి దేశంలో అనేక చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని.. ఇది విధ్వంసకారుల చర్యేనని అధ్యక్షుడు నికోలస్ మడురో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Bigg Boss Telugu 8: ‘బిగ్ బాస్ 8’.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్ళే
అన్ని రాష్ట్రాల్లో ఈ సమస్య కనిపించిందని సమాచారశాఖ మంత్రి ఫ్రెడీ నానెజ్ పేర్కొన్నారు. అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు చేసిన ప్రయత్నంగా భావిస్తున్నామన్నారు. దీనిని అధిగమించేందుకు కేంద్రం మొత్తం క్రియాశీలంగా పనిచేస్తోందన్నారు. విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన.. దేశ ప్రజల శాంతి, సామరస్యాన్ని ఎవ్వరూ దెబ్బతీయలేరన్నారు. 2019 నుంచి రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న వెనుజువెలాలో విద్యుత్ అంతరాయాలు నిత్యకృత్యంగా మారాయి. అయితే ఇది ప్రత్యర్థుల పనేనని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ నిపుణులు మాత్రం విద్యుత్ పంపిణీ వ్యవస్థతో పాటు జలవిద్యుత్ మౌలిక సదుపాయాల నిర్వహణ లోపాల కారణంగానే ఇవి చోటుచేసుకుంటున్నట్లు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: శనివారం 3 వందేభారత్ రైళ్లు ప్రారంభించనున్న మోడీ
విద్యుత్ సంక్షోభం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజధాని వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా రద్దీగా ఉండే సమయంలో ట్రాఫిక్ సాధారణం కంటే తక్కువగా ఉంటుంది. ఇక సెల్‌ఫోన్ సేవ లేకపోవడం వల్ల కుటుంబ సభ్యులతో కమ్యూనికేట్ చేయలేక పోతున్నామని కొందరు ఫిర్యాదు చేశారు.
[ad_2]