Trending news

Vastu Tips: ఈ సమయాల్లో డబ్బును అస్సలు ఖర్చు పెట్టకూడదట..

[ad_1]

డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. అందులోనూ ఖర్చు పెట్టే విషయంలో ఆచి తూచి ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే కొంత మంది మాత్రం ఎలా పడితే అలా డబ్బును ఖర్చు పెడుతూ ఉంటారు. అస్సలు డబ్బుకు విలువ అనేది ఇవ్వరు. దీని వల్ల ఆ తర్వాత ఆర్థిక సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం నడుచుకుంటే.. ఆర్థికంగా బలంగా ఎదుగుతారని అంటున్నారు. వాస్తు శాస్త్రాన్ని కేవలం ఇంటి నిర్మాణ విషయంలోనే కాకుండా.. మనం రోజు వారీ చేసే కొన్ని ముఖ్యమైన పనుల విషయంలో కూడా కొన్ని నియమాలను పాటిస్తే.. మంచి ఫలితాలను అందుకుంటారు. మరి డబ్బును ఖర్చు పెట్టే విషయంలో ఎలాంటి నియమాలను పాటిస్తే మంచిదో.. ఏ సమయంలో డబ్బును ఖర్చు పెట్టాలి? ఎప్పుడు ఖర్చు పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా చేయడం వల్ల మీకు లాభాలే కానీ.. నష్టాలు అనేవి ఉండవని వాస్తు శాస్త్రం చెబుతుంది. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఎప్పుడు పడితే అప్పుడు ఖర్చు పెట్టకూడదు:

చాలా మంది డబ్బును ఎప్పుడు పడితే అప్పుడు ఖర్చు పెడుతూ ఉంటారు. అలా ఎలా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు డబ్బును ఖర్చు పెట్ట కూడదు. డబ్బును ఖర్చు చేసేందుకు కూడా ఒక సమయం ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

బ్రహ్మ ముహూర్తంలో..

చాలా మందికి తెలియక బ్రహ్మ ముహూర్తంలో డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదట. బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు ఉండే ముహూర్తం. ఈ సమయంలో డబ్బును అస్సలు ఖర్చు పెట్టకూడదని వాస్తు శాస్త్రం చెబుతుంది.

ఇవి కూడా చదవండి

సూర్యోదయ సమయంలో..

అదే విధంగా సూర్యోదయ సమయంలో కూడా డబ్బును వృథాగా ఖర్చు చేయకూడదట. కేవలం అవసరాల నిమిత్తం మాత్రమే ఆలోచించి ఖర్చు చేయాలని.. ఏవి పడితే అవి అస్సలు కొనకూడదని వాస్తు శాస్త్రం చెబుతుంది.

సూర్యాస్తమయ సమయంలో..

సూర్యాస్తమయ సమయంలో కూడా డబ్బును పెద్దగా ఖర్చు పెట్టవద్దని వాస్తు శాస్త్రం అంటుంది. ఎందుకంటే ఈ సమయంలో డబ్బుకు ఉన్న పవర్ తగ్గుతుంది. దీంతో మీకు ఆర్థిక కష్టాలు వచ్చే అవకాశం ఉందట. ఇలా ఈ మూడు సమయాల్లో డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించాలని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇలా చేయడం వల్ల చేతిలో ధనం అనేది నిలుస్తుంది. ఆర్థిక కష్టాలు రాకుండా ఉంటాయి. ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

[ad_2]

Related Articles

Back to top button
Close
Close