Vastu: ఈ వస్తువులను బహుమతిగా ఇస్తున్నారా.? గొడవలు తప్పవు..

[ad_1]

మనకు నచ్చిన వ్యక్తులకు లేదా స్నేహితులకు, సన్నిహితులకు బహుమతులు ఇవ్వడం సర్వసాధారణమైన విషయం. అయితే బహుమతులు ఇచ్చే విషయంలో కూడా పలు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. కొన్ని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో బహుమతులుగా ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు. వీటివల్ల బహుమతులు ఇచ్చి పుచ్చుకునే వారి మధ్య గొడవలకు, మనస్పార్థాలకు దారి తీస్తుందని అంటున్నారు. ఇంతకీ బహుమతిగా ఇవ్వకూడని ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* మనలో చాలా మంది పెళ్లిలలో దేవుడు విగ్రహాలను, ఫొటోలను బహుమతిగా ఇస్తుంటాం. కానీ ఇలా ఇవ్వడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అలాగే పిడికిలి కంటే పెద్ద విగ్రహాలను పూజించడం దేవుని ఇంట్లో మంచిది కాదు. కాబట్టి దేవుడి ఫొటోలు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
* పెన్నులు, పుస్తకాలను బహుమతులుగా ఇవ్వడం సర్వసాధారణం. ముఖ్యంగా చిన్నారులకు పుట్టిన రోజు సందర్భంగా ఇలాంటి బహుమతులు ఇస్తుంటారు. అయితే ఇలా ఇవ్వడం మంచిది కాదని వాస్తు పండితులు చెబుతున్నారు.
* ఇక ఎట్టి పరిస్థితుల్లో షర్ట్ క్లాత్, కర్చీఫ్, టవల్స్ లాంటివి బహుతులుగా ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు. ఇలాంటివి ఇవ్వడం వల్ల తీసుకున్న వారికి, ఇచ్చిన వారికి మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుంది.
* వాటర్ ఫౌంటెన్, అక్వేరియం వంటి నీరు ఉండే వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో బహుమతిగా ఇవ్వకూడదని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఇవి చూడ్డానికి బాగానే ఉన్నా వాటిని బహుమతిగా ఇవ్వడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.
* ఇక ఎట్టి పరిస్థితుల్లో బహుమతులుగా ఇవ్వకూడని వాటిలో పదునైన వస్తువులు ఒకటి. కత్తులు, చాక్‌లను బహుమతులుగా ఇస్తే ఇచ్చిన వారికి, తీసుకున్న వారికి మధ్య గొడవలు జరుగుతాయి. అందుకే పదునైన వస్తువులను ఎప్పుడూ బహుమతిగా ఇవ్వకూడదు.
* చాలా మంది బహుమతులుగా వ్యాలెట్‌లను ఇస్తుంటారు. అయితే పర్సులు, వ్యాలెట్‌లను ఎట్టి పరిస్థితుల్లో బహుమతులుగా ఇవ్వకూడదు. ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా స్త్రీ, పురుషులు ఇలాంటి వస్తువులను అస్సలు ఎక్స్ఛేంజ్ చేసుకోకూడదు.
* ఊరగాయలను ఫ్రీగా ఇవ్వడం మంచిది కాదని వాస్తు పండితులు చెబుతున్నారు. వీటిలో ఉప్పు అధికంగా ఉంటుంది. కాబట్టి ఉచితంగా ఇవ్వకూడదు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే కనీసం ఒక రూ. 10 అయినా ఇచ్చి తీసుకోవాలని చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
[ad_2]