Uttam Kumar Reddy : 2026 మార్చిలో దేవాదుల ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాం..

[ad_1]

ములుగు జిల్లా దేవాదుల ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 2026 మార్చిలో దేవాదుల ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. సోనియా గాంధీ చేతులమీదుగా ప్రారంభోత్సవం చేస్తామని ఆయన వెల్లడించారు. ఇరిగేషన్ శాఖను అడ్డుపెట్టుకొని దోపిడీకి కేసీఆర్ పాల్పడ్డారని, ప్రతీ ప్రాజెక్టులో వేల కోట్ల స్కాం జరిగిందని ఆయన ఆరోపించారు. 1.81 లక్షల నిధులు కేసీఆర్ హాయంలో ఖర్చుపెట్టారని, 14వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉంచారన్నారు. కమిషన్ల కకృత్తి కొరకు ప్రాజెక్టులు కట్టారని, కాళేశ్వరం, పాలమూరు, దేవాదుల, సీతారామ అన్నిట్లో దోచుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ గ్రామీణ ముఖ చిత్రం మార్చడం మా లక్ష్యమని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతీ ఎకరాకు నీళ్ళు అందిస్తామని, కాళేశ్వరం ప్రాజెక్టును నాశనం చేసారని ఆయన మండిపడ్డారు. నిర్దేశిత గడువులోపు దేవాదుల పూర్తి చేసి, 5.57 లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తామని, సమ్మక్క బ్యారేజ్ కట్టడం వల్ల దేవాదుల ద్వారా 300 రోజులు, 60 టిఎంసిల నీళ్ళు లిఫ్ట్ చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్.
New Zealand: న్యూజిలాండ్ మహిళల జట్టు కెప్టెన్ కీలక నిర్ణయం.. టీ20 వరల్డ్ కప్ తర్వాత..!
అంతేకాకుండా..’ఉమ్మడి వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేసీఆర్ కు అవగాహన లేకుండా తీరని అన్యాయం చేశారు. వాటిని మేము సరిచేస్తూ వస్తున్నాము. సీతారామ ప్రాజెక్టుకు 67 టిఎంసి లు కేటాయించేలా CWC తో చర్చలు జరుపుతున్నాం. సమ్మక్క సారక్క బ్యారేజ్ ఎన్వోసీ కోసం ఛత్తీస్గఢ్ ను ఒప్పిస్తాం. ఉత్తుత్తి హామీలు మేము ఇవ్వము, చెప్పింది చేసి తీరుతాం. ఫార్మ్ హౌజ్ లో కూర్చొని నిర్ణయాలు తీసుకోము. 24 గంటలు ప్రజలకు, అధికారులకు అందుబాటులో ఉంటాం. దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ బిల్లులు త్వరలో చెల్లిస్తాం. ధరలు పెరగడంతో భూసేకరణ ఇబ్బందిగా మారింది. పారదర్శకంగా భూసేకరణ చేస్తాము. ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణ కోసం ప్రత్యేక ఐఏఎస్ అధికారిణి నియమిస్తున్నం. ఇరిగేషన్ శాఖ బలోపేతం కోసం 700 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను నియమించాము. 1800 లస్కర్లను తీసుకోబోతున్నాం. ఆపరేషన్ మైంటేనెన్స్ కోసం1100 కోట్లు కేటాయిస్తాము. అన్ని ప్రాజెక్టులకు డిసిల్టింగ్, డీసెడిమెంట్ అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి చేయబోతున్నాం’ అని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.
Weather Alert: గుజరాత్ సమీపంలో తీవ్ర అల్పపీడనం.. 6 గంటల్లో తుఫాన్‌గా మారే ఛాన్స్
[ad_2]