Trending news

Ustaad Bhagat Singh: పవన్ ఫాన్స్ రెడీగా ఉండండమ్మా…

[ad_1]

Ustaad Bhagat Singh: పవన్ ఫాన్స్ రెడీగా ఉండండమ్మా…

Ustaad Bhagat Singh Update on Pawan Kalyan Birthday: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అదంతా ఎన్నికల ముందు వరకు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన సినిమాలకు సమయం కేటాయించే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతానికి ఆయన షూటింగ్ మొదలుపెట్టిన సినిమాలు మూడు ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్స్ మొదలై షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ మధ్యనే ఉస్తాద్ భగత్ సింగ్ సహా మిగతా సినిమాల నిర్మాతలు మంగళగిరి వెళ్లి పవన్ కళ్యాణ్ తో భేటీ అయి వచ్చారు. ఎప్పుడు సినిమా షూటింగ్స్ మొదలు పెట్టాలనే విషయం మీద చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఒక అప్డేట్ ఇవ్వబోతున్నట్లు ఈరోజు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ వెల్లడించారు.

Mythri Ravi Shankar: పుష్పపై పవన్ కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తున్న మత్తు వదలరా సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన అందులో ఎదురైన ఒక ప్రశ్నకు సమాధానం గా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ చేస్తుండగా, రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న అశుతోష్ రానా, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close