Trending news

UPSC Civils Free Coaching 2025: హైదరాబాద్‌లో.. యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు ఉచిత కోచింగ్‌! ఇలా అప్లై చేసుకోండి

[ad_1]

హైదరాబాద్‌, ఆగస్టు 30: హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ 2025 సివిల్‌ సర్వీస్‌ ప్రిలిమినరీ కం మెయిన్స్‌ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్ధులకు రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ (ఆర్‌సీఏ)లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు సెప్టెంబర్‌ 20, 2024వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. ప్రవేశ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌తో పాటు వసతి సౌకర్యం కల్పిస్తారు. సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ కం మెయిన్స్‌)-2024 కోచింగ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే.. ఏదైనా డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: ఆగస్టు 27, 2024.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 20, 2024.
  • సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ కం మెయిన్స్‌)-2024 కోచింగ్‌ ప్రవేశ పరీక్ష తేదీ: సెప్టెంబర్‌ 29, 2024.
  • ప్రవేశ పరీక్ష ఫలితాల వెల్లడి తేదీ: అక్టోబర్‌ 04, 2024.
  • ఇంటర్వ్యూ జరిగే తేదీలు: అక్టోబర్‌ 15 నుంచి 18, 2024 వరకు
  • తుది ఫలితాల వెల్లడి తేదీ: అక్టోబర్‌ 21, 2024.
  • అడ్మిషన్‌ ముగింపు తేదీ: అక్టోబర్‌ 25, 2024.
  • తరగతుల ప్రారంభ తేదీ: అక్టోబర్‌ 28, 2024.

పూర్తి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

అధికారిక వెబ్‌సైట్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

[ad_2]

Related Articles

Back to top button
Close
Close