Trending news

UP: భారతీయ యువతికి దుబాయ్ లో మరణశిక్ష.. రక్షించాలని వేడుకున్న వృద్ధ తల్లిదండ్రులు

[ad_1]

  • భారతీయ మహిళకు దుబాయ్ లో మరణశిక్ష
  • రక్షించాలని మోడీ..యోగీని వేడుకున్న తల్లిదండ్రులు
  • తమ కుమార్తెను తప్పుడు కేసులో ఇరికించారన్న పేరెంట్స్
UP: భారతీయ యువతికి దుబాయ్ లో మరణశిక్ష.. రక్షించాలని వేడుకున్న వృద్ధ తల్లిదండ్రులు

ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాకు చెందిన ఓ యువతిని దుబాయ్‌లో సెప్టెంబర్ 20 తర్వాత ఉరితీయనున్నారు. జోక్యం చేసుకుని తమ కూతురు ప్రాణాలను కాపాడాలని ప్రధాని మోడీ, సీఎం యోగిని ఈ యువతి తల్లిదండ్రులు వేడుకున్నారు. న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమయ్యారు. మోసగాళ్లు తమ కూతురు షెహజాదీని బలవంతంగా.. చిన్నారి హత్య కేసులో ఇరికించారని తల్లిదండ్రులు చెబుతున్నారు. నిజానికి ఆమె ఫేషియల్ ట్రీట్‌మెంట్ కోసం విదేశాలకు వెళ్లింది. దుబాయ్‌లో చిక్కుకున్న యువతి తండ్రి ఆగ్రాకి చెందిన ఉజైర్.

READ MORE: Tata Curvv: టాటా మోటార్స్ కర్వ్ ICE మోడల్‌ విడుదల.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

వాస్తవానికి, బందాలోని మతౌండ్ పోలీస్ స్టేషన్ పరిధి గోయ్రా ముగ్లి గ్రామంలో నివసిస్తున్న సబ్బీర్ ఖాన్ కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్నకుమార్తె షాజాది 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు స్టవ్‌పై ద్వారా మంటలు వ్యాపించడంతో ముఖం కాలిపోయింది. ముఖం వికృతమైంది. ఈమె సామాజిక సేవ చేసే సంస్థతో సంబంధం కలిగి ఉంది. ఇదిలా ఉండగా ఆగ్రాలో నివాసముంటున్న ఉజైర్ అనే అబ్బాయితో ఫేస్ బుక్ ద్వారా స్నేహం ఏర్పడింది.

READ MORE:TMC Leader: “మీ ఇంట్లోకి దూరి మీ తల్లులు, అక్కాచెల్లెళ్ల అసభ్యకరమైన ఫోటోలు తీస్తాం..”

ఆమె ముఖానికి దుబాయ్‌లో చికిత్స చేయిస్తానని చెప్పి ఉజైర్ ఆమెను మోసగించాడు. తన అత్తా మామలు తదితర బంధువులు దుబాయ్‌లో ఉంటున్నారని ఉజైర్ చెప్పాడు. దుబాయ్ తీసుకెళ్లాడు. ఉజైర్ తన కుమార్తెను దుబాయ్‌లో రూ. 1.5 లక్షలకు విక్రయించాడని షాజాది తండ్రి సబ్బీర్ ఖాన్ ఆరోపించారు. దీంతో పాటు 4 నెలల చిన్నారి మృతి కేసులో షాజాది ని చేర్చారన్నారు.

READ MORE:Heavy Flood in Krishna River: కృష్ణా నదిలో పోటెత్తుతున్న వరద..! వణికిపోతున్న బెజవాడ వాసులు

షాజాది అక్కడ ఓ ఇంట్లో పనిచేస్తుండగా.. యజమాని అనారోగ్యంతో ఉన్న బిడ్డను సరిగ్గా చూసుకోలేదని, దాని కారణంగా పాప మరణించిందని కేసు నమోదైంది. ఆమెను కోర్టులో ప్రవేశ పెట్టగా.. మరణశిక్ష పడింది. బాధితురాలి తండ్రి సబ్బీర్ కోర్టులో ఫిర్యాదు లేఖను అందించారు. నిందితుడైన యువకుడు ఉజైర్, అతని బంధువుతో సహా నలుగురిపై మతౌండ్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు సెక్షన్ 370/ 370 ఎ/ 419/ 420/ 386/ 311/ 367 కింద కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకుని విచారించాలని, తద్వారా మొత్తం రహస్యం బయటపడాలని తండ్రి పోలీసులను డిమాండ్ చేశారు.
young Indian woman was sentenced to death in Dubai, Latest Telugu News, Uttar Pradesh, Agra, PM Modi, CM Yogi



[ad_2]

Related Articles

Back to top button
Close
Close