Trending news

Unified Pension Scheme: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నయా పింఛన్ స్కీమ్.. 25 ఏళ్ల సర్వీసుతో ఎంత పింఛన్ వస్తుందో? తెలుసా?

[ad_1]

భారతదేశంలో 20 ఏళ్ల తర్వాత ఉద్యోగుల పింఛన్ల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అంతకుముందు 2004లో కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ సిస్టమ్ (ఓపీఎస్)ని కొత్త పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్)తో భర్తీ చేసింది. ఈ విధానాన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) ను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ఉన్న ఎన్‌పీఎస్ వ్యవస్థను మెరుగుపరిచే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే యూపీఎస్ కింద పదవీ విరమణ ప్రయోజనాల స్పష్టత గురించి ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు రిటైర్‌మెంట్ సమయంలో పొందే మొత్తంపై ప్రభుత్వం ఇంకా స్పష్టమైన వివరాలను అందించలేదు. ఈ నేపథ్యంలో ఓ 25 ఏళ్లు సర్వీసులో ఉన్న ఉద్యోగి యూపీఎస్ కింద ఎంత మొత్తాన్ని పొందుతాడో? ఓ సారి తెలుసుకుందాం. 

పింఛన్ పథకంలో ఉద్యోగి నుంచి డిపాజిట్ పేరుతో తీసుకున్న సొమ్మును పూర్తిగా తిరిగి ఇవ్వాలని తమ డిమాండ్‌ను లేవనెత్తినట్లు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సెంట్రల్ ఎంప్లాయీస్ సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా తెలిపారు. అయితే ప్రభుత్వం నిర్ణీత ఫార్ములా ఆధారంగా ఏకమొత్తాన్ని అందించడానికి మాత్రమే అంగీకరించింది. పదవీ విరమణ తర్వాత అందించిన మొత్తాన్ని లెక్కించడానికి ప్రభుత్వం రెండు సూత్రాలను వివరించింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగులు గ్రాట్యుటీ డబ్బును స్థిరమైన ఫార్ములా ఆధారంగా ఒకేసారి మొత్తం అందుకుంటారు. 25 ఏళ్లు పనిచేసిన వ్యక్తి విషయానికి వస్తే ప్రతి నెల సర్వీస్‌కు 15 రోజుల జీతం ఆధారంగా గ్రాట్యుటీ లెక్కించబడుతుంది. ఈ ఫార్ములాలో సర్వీస్ మొత్తం వ్యవధిని చివరిగా సంపాదించిన జీతంతో గుణించడంతో పాటు ఆ మొత్తాన్ని 15 రోజులతో గుణిస్తారు. అనంతరం దానిని 26తో భాగిస్తారు. ఉదాహరణకు పదవీ విరమణకు ముందు ఒక ఉద్యోగి చివరి జీతం రూ. 1.30 లక్షలు ఉండి వారు 25 సంవత్సరాలు పనిచేసినట్లయితే వారి మొత్తం గ్రాట్యుటీ రూ. 18.75 లక్షలు అవుతుంది. ఈ మొత్తం ఇది పదవీ విరమణ తర్వాత అందదిస్తారు. 

అయితే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) కింద ఏకమొత్తానికి సంబంధించి ప్రభుత్వం మరో ఫార్ములాను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రతి ఆరు నెలల సర్వీస్‌కు వారి జీతంలో 10 శాతం పొందుతారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి నెలవారీ జీతం రూ. 80,000తో 25 సంవత్సరాలు పని చేస్తే అతను ఆరు నెలల్లో సంపాదించే మొత్తం రూ.4.8 లక్షలు అవుతుంది. అతని ఆరు నెలల సర్వీస్‌లో పది శాతం (రూ. 4.8 లక్షలు) రూ. 48,000 అవుతుంది. అతని 25 సంవత్సరాల సర్వీసును పరిగణలోకి తీసుకుంటే మొత్తం రూ. 24 లక్షల మొత్తం వస్తుంది. అలాగే రిటైర్‌మెంట్‌పై గ్రాట్యుటీకి అదనంగా లంప్సమ్ మొత్తాన్ని సూపర్‌యాన్యుయేషన్‌గా ఇవ్వనున్నట్లు ప్రభుత్వ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇప్పుడు గ్రాట్యుటీ మరియు ఏకమొత్తం మొత్తం కలిపితే మొత్తం రూ. 42.75 లక్షలు (రూ. 24 లక్షలు+రూ. 18.75 లక్షలు) అవుతుంది. ఆ విధంగా 25 సంవత్సరాలు పనిచేసిన తర్వాత, పదవీ విరమణపై వ్యక్తి చేతిలో మొత్తం రూ. 42.75 లక్షలు పొందవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

[ad_2]

Related Articles

Back to top button
Close
Close