Tummala Nageswara Rao : ఎంత మంది ఉన్నా అందరికీ నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తాం

[ad_1]

ఖమ్మం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మంత్రి తుమ్మల మాట్లాడారు. మున్నెరు వాగు ఉదృతంగా ప్రవహించటంతో ప్రకాష్ నగర్ లో పెద్ద ఎత్తున వరద వచ్చిందన్నారు. దీంతో రక్షణ చర్యలు చేపట్టాడానికి అటంకం ఏర్పడిందని, వాతావరణం అనుకూలించక రక్షణ చర్యలు లేట్ అవ్వటంతో బాధితులు అసహనం వ్యక్తం చేశారని అన్నారు. వాతావరణం అనుకూలించక తెలంగాణ హెలిప్యాడ్ రావటానికి ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన తెలిపారు. ఆంధ్ర హెలిప్యాడ్‌లో ప్యూయిల్ నింపుకొని వచ్చే వరకు ఆలస్యం అయిందని తెలిపారు. మున్నెరు బ్రిడ్జి వద్ద చిక్కుకున్న పది మంది సురక్షితంగా బయటపడ్డారు. డ్రోన్‌ల ద్వారా కావాల్సిన సామాగ్రిని బాధితులకు పంపించాం. ఖమ్మంలో పది ప్రాంతాల వరకు నీట మునిగాయి. ఎవ్వరికి ప్రాణ నష్టం జరగకుండా చూశాం.పాలేరు లోని వరద దాటికి ఒకరు మృతి చెందారు. ఇళ్ళు అన్ని రహదారులు అన్ని బురద మయం అయి తీవ్ర ఇబ్బందులు ప్రజలు ఎదుర్కుంటున్నారు.సహయక చర్యల్లో భాగంగా జిల్లాలో ఉన్న మునిసిపల్ సిబ్బంది ని అందరిని పిలిపించి మరమ్మతులు చేపిస్తామన్నారు.
Big Boss8: బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ డిష్యుం..డిష్యుం.. శేఖర్ బాషా vs సోనియా
విద్యుత్ పునరద్దిస్తామని, ఎంత మంది ఉన్నా అందరికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు.. సాయంత్రం ముఖ్యమంత్రి పొగ్రాం లోపే అందరికి సహయం అందిస్తామని, అని ప్రాంతాల్లో ప్రజలు కుదటపడే వరకు అన్ని స్వచ్చంద సేవలు ముందుకు రావాలని తుమ్మల పిలుపు నిచ్చారు. ఎంత ఖర్చు అయిన సహయ సహకారలు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. వరద ప్రభావంపై ఎప్పటికప్పుడు సమాచారం ప్రభుత్వ దృష్టి కి తీసుకొచ్చిన మీడియా కు ప్రభుత్వం పరంగా కృతజ్ణతలు తెలిపారు. అధికారులతో సంప్రదించి కొన్ని ప్రాంతాలు సీఎం పర్యటించనున్నారు. ప్రస్తుత పరిష్కర దిశ ఆలోచనలు చేస్తున్నం.బాధితులకు ఎలాంటి ఉపశమనం ఇవ్వాలో ముఖ్యమంత్రి పర్యటన అనంతరం తెలుపుతాం..జిల్లాలో అన్ని శాఖలను ఖమ్మం పిలుపిస్తున్నాం.ఆరోగ్య సమస్యలు రాకుండా హెల్త్ క్యాంపులు పెట్టిస్తాంఖమ్మం లో ఎన్ని ఇళ్ళు మునిగాయి ఎంటి అనేది సమాచారం తీసుకొని బాధితులకు సహయ సహకారాలు అందిస్తాం ముందుగా శానిటేజ్ వర్క్ చేపించి తాత్కాలిక ఏర్పాట్లు పూర్తి అయిన తరువాత నష్టం పరిహరం చెప్తాం అని తెలియజేశారు…
AUS vs IND: పుజారా, రహానే స్థానాలకు ఆ ఇద్దరే సరైనోళ్లు: డీకే
[ad_2]