Top newsTrending newsViral news

TSPSC Group 1 Hall Tickets 2022

తెలంగాణ గ్రూప్‌ 1 హాల్‌టికెట్లు విడుదల..?

 

 

 

 

TSPSC Group 1 Exam 2022: తెలంగాణ గ్రూప్ -1 పరీక్షకు సంబంధించి మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 756 మంది చొప్పున పోటీపడుతున్నారు.

 

 

 

 

 

TSPSC Group 1 Hall Ticket 2022: తెలంగాణ గ్రూప్-1 ప‌రీక్షకు సంబంధించి అన్ని జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అక్టోబరు 16న ప్రిలిమ్స్ పరీక్ష జరగనుండగా.. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని TSPSC చైర్మన్ జనరార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో కలెక్టర్లు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్(TSPSC Group 1 Prelims) పరీక్షను జూలై నెలలోనే నిర్వహిచాలి.. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు ఉండటంతో.. దీనిని అక్టోబర్ 16కు వాయిదా వేశారు. ఈ పరీక్ష తేదీ కూడా వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో పుకార్లు లేచాయి. దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్ 16వ తేదీన గ్రూప్ 1 పరీక్ష కచ్చితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

 

 

 

ఒక్కో పోస్టుకు 756 మంది పోటీ:


తెలంగాణ గ్రూప్ -1 పరీక్షకు సంబంధించి మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 756 మంది చొప్పున పోటీపడుతున్నారు. గ్రూప్-1 ప్రకటనలో మొత్తం 503 పోస్టుల్లో మహిళలకు 225 రిజర్వు అయ్యాయి. వీటికి 1,51,192 మంది దరఖాస్తు చేయగా.. ఒక్కో పోస్టుకు సగటున 672 మంది పోటీపడుతున్నారు. జనరల్ పోస్టుల్లోనూ మెరిట్ సాధిస్తే మరిన్ని పోస్టులు పొందేందుకు అవకాశముంది. దివ్యాంగుల కేటగిరీలో గల 24 పోస్టులకు 6,105 మంది దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు 254 మంది చొప్పున పోటీలో ఉన్నారు. 51,553 (15.33శాతం )మంది ప్రభుత్వ ఉద్యోగులూ దరఖాస్తు చేసుకున్నారు. ఇక.. పరీక్షకు వారం రోజుల ముందు హాల్‌టికెట్లు https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.

 

 

TSPSC Group 4 Notification 2022: త్వరలో తెలంగాణ గ్రూప్‌ 4 నోటిఫికేషన్‌
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు (Telangana Government Jobs) సంబంధించి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 9618 ఖాళీలు ఉన్న గ్రూప్ 4 నోటిఫికేషన్ (TSPSC Group 4 Notification) కూడా త్వరలోనే విడుదలవుతుందని అందరూ భావిస్తున్నారు. పోస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇటీవల ఆర్థిక మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) TSPSC Group 4 Notification పై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే గ్రూప్- 4 నోటిఫికేషన్ విడుదల అవుతుందని వెల్లడించారు. ఇందుకోసం నిరుద్యోగులంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. తాజా సమాచారం ప్రకారం.. అక్టోబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.

 

 

 

 

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close