Trending news

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

[ad_1]

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

కృష్ణమ్మ ఉధృతితో కొట్టుకొస్తున్న బోట్లు.. విజయవాడ రైల్వే బ్యారేజీకి 3 అడుగుల దూరంలో వరద నీరు

విజయవాడలోని కృష్ణా నదికి భారీగా వరద నీరు వస్తుంది. దీంతో విజయవాడలోని రైల్వే బ్యారేజ్ కి మూడు అడుగుల దూరంలో ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహిస్తుంది. వరద ప్రవాహం పెరిగితే రైల్వే ట్రాక్ పైకి నీళ్లు వచ్చే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజ్, కనకదుర్గమ్మ వారధి మీదుగా, ప్రవహిస్తున్న లక్షల క్యూసెక్కుల నీరు.. ప్రకాశం బ్యారేజీ దిగువకు విడుదల చేస్తున్న 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు.. 2009లో వచ్చిన వరద వికృతి కంటే అదనంగా వరద వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక, కృష్ణమ్మకు వరద పోటుతో బోట్లు కొట్టుకొచ్చేస్తున్నాయి. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు వరద ప్రవాహంలో బోటు కొట్టుకొచ్చింది. ప్రకాశం బ్యారేజీ గేట్ కు ఓ బోటు ఢీకొట్టింది. బోటు ఢీకొనడంతో గేట్ లిఫ్ట్ చేసే ప్రాంతంలో డామేజ్ అయింది. ప్రకాశం బ్యారేజ్ వైపు మరో నాలుగు బూట్లు కొట్టుకొచ్చాయి. ఇక, మరోవైపు.. రికార్డ్ స్థాయిలో ప్రకాశం బ్యారేజీకి 11.25 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లూ కొనసాగుతుంది. ప్రకాశం బ్యారేజీకి వస్తున్న నీటిని వచ్చినట్టుగానే సముద్రంలోకి వదిలేస్తున్న అధికారులు.. ప్రకాశం బ్యారేజీకి 2009లో 11.10 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. 2009 నాటి కంటే 15 వేల క్యూసెక్కుల నీరు ఎక్కువగా ప్రకాశం బ్యారేజీకి ఇన్ ఫ్లోస్ వస్తుంది.

90 శాతానికి చేరుకున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం 90శాతానికి చేరుకుంది. మరి కొన్ని గంటలలో ప్రాజెక్టు వరద గేట్లుఎత్తి గోదావరి నదిలోకి వదిలి అవకాశం ఉంది. కావున గోదావరి నదీ పరిసర ప్రాంతాలలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండవలెనని ముఖ్యంగా రైతులు చేపలు పట్టేవారు పశువుల కాపరులు నదిలోకి దిగవద్దని విజ్ఞప్తి చేశారు ఇంజనీర్ ఇరిగేషన్ సర్కిల్ పోచంపాడు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సూపరింటెండింగ్.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువ పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయవలసిందిగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా మిత్రులకు పోలీస్, రెవెన్యూ అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.

మరోసారి నిలిచిన విజయవాడ- హైదరాబాద్ మధ్య రాకపోకలు..

విజయవాడ- హైదరాబాద్ మధ్య రాకపోకలకు హైవేపై మరోసారి అవరోధం ఏర్పాడింది. గరికపాడు దగ్గర పాలేరు బ్రిడ్జి దెబ్బ తిన్నది. ఇది ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద ఆంధ్ర- తెలంగాణ సరిహద్దులోని పాలేరు బ్రిడ్జిపై వరద నీరు ప్రవహిస్తూ రోడ్డును కోసివేయటంతో బ్రిడ్జిపై రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అలాగే తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వాహనాల రాకపోకలను ఆపేసి.. బ్రిడ్జికి ఇరువైపుల భారీ వాహనాలను అడ్డుగా పెట్టారు.


ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక.. రికార్డ్ స్థాయిలో వరద..!

కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయి వరద వచ్చి చేరుతోంది. 11 లక్షల 20 వేల క్యూసెక్కులకు వరద చేరుతుంది. దీంతో ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఇక, బ్యారేజీలోని 70 గేట్లు ఎత్తి కిందకు వరద నీటిని రిలీజ్ చేస్తున్నారు. బ్యారేజీ చరిత్రలో తొలిసారిగా రికార్డ్ స్థాయిలో వరద వచ్చింది.. 2009 అక్టోబర్‌లో 10 లక్షల 94 వేల క్యూసెక్కుల వరద రాగా.. 1903 వ సంవత్సరంలో 10 లక్షల 60 వేలు క్యూసెక్కుల వరద నీరు వచ్చింది.. ఇక, బ్యారేజీ దిగువ భాగాన అనేక గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి.

ఫలించిన సీఎం చంద్రబాబు ప్రయత్నాలు.. విజయవాడకు చేరిన పవర్ బోట్స్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి. విజయవాడకు పవర్ బోట్స్ చేరుకున్నాయి. నిన్న కేంద్రంతో మాట్లాడిన తరువాత వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు బోట్స్ వచ్చాయి. దీంతో బోట్స్ ద్వారా సింగ్ నగర్ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ కొనసాగుతుంది. పెద్ద ఎత్తున బోట్స్ రావడంతో ఇళ్ల నుంచి బాధితులను బయటకు తెచ్చే పనులు వేగవంతం అయ్యాయి. పునరావాస కేంద్రాలకు వెళ్లే వాళ్లకు దుస్తులు కూడా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పాల ప్యాకెట్లు, ఆహారం, నీళ్ళ బాటిల్స్ అందిస్తున్న ప్రభుత్వం.. ప్రైవేటు హోటల్స్, దుర్గగుడి, అక్షయపాత్రల ద్వారా ఏపీ సర్కార్ ఆహారం సమకూర్చింది.

అర్థరాత్రి రష్యా పై 150కి పైగా డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్

మాస్కో నగరంలో రెండు డ్రోన్‌లు.. మాస్కో పరిసరాల్లో తొమ్మిది సహా 158 ఉక్రేనియన్ డ్రోన్‌లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు రాత్రిపూట కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. గత రాత్రి ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడులను ఇప్పటివరకు ఉక్రెయిన్ చేసిన అతిపెద్ద డ్రోన్ దాడిగా అభివర్ణిస్తున్నారు. కుర్స్క్ ప్రాంతంలో నలభై ఆరు డ్రోన్‌లు ధ్వంసమయ్యాయి. ఇక్కడ ఉక్రెయిన్ ఇటీవలి వారాల్లో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా గడ్డపై అతిపెద్ద దాడిలో దళాలను పంపింది. బ్రయాన్స్క్ ప్రాంతంలో 34 డ్రోన్లు, వోరోనెజ్ ప్రాంతంలో 28 కంటే ఎక్కువ డ్రోన్లు మరియు ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న బెల్గోరోడ్ ప్రాంతంలో 14 డ్రోన్లు ధ్వంసమయ్యాయి.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ గవర్నర్ విజ్ఞప్తి..

భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని.. ప్రభుత్వ అధికారుల సహాయంతో అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి వెళ్లవద్దని గవర్నర్ హెచ్చరించారు. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారు ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని.. తద్వారా వారిని రక్షించి పునరావాస ప్రాంతాలకు తరలించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఏర్పాటు చేయవచ్చని ఆయన అన్నారు. రెడ్‌క్రాస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇతర ఎన్‌జీవోలు ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలి.. బాధితులకు ఆహారం, మందులు, ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీలో రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్‌లలో చురుకుగా పాల్గొనాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ అభ్యర్థించారు.

ఫేక్ వార్తలపై కాంగ్రెస్ అప్రమత్తం.. దేశవ్యాప్తంగా క్విక్ రెస్పాన్స్ టీమ్‌ ఏర్పాటు

తప్పుడు వార్తలపై కాంగ్రెస్ దూకుడు పెంచింది. కాంగ్రెస్ లీగల్ టీమ్ సమావేశం అనంతరం జిల్లాల వారీగా ఈ శాఖను పెద్ద ఎత్తున విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ చెత్తను పరిష్కరించడానికి క్విక్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేస్తారు. ఇది అటువంటి కేసులను పరిగణలోకి తీసుకుంటుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంది. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌లను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ లీగల్ సెల్ భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో గాంధీ కుటుంబం, కాంగ్రెస్ ఆ పార్టీ పెద్ద నాయకులపై ఫేక్ న్యూస్ కేసులో పెద్ద ఎత్తున చట్టపరమైన చర్యలకు సన్నాహాలు చేయనున్నారు. ఇందులో ముఖ్యంగా మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఆ మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కాంగ్రెస్ టీమ్ ఏర్పడనుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త సోషల్ మీడియా విధానాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ దూకుడుగా చర్య తీసుకున్నారు. ఇందులో దేశ వ్యతిరేకమైనవిగా పరిగణించబడే సోషల్ మీడియా పోస్ట్‌లపై చర్య తీసుకోనున్నారు.

మణిపూర్‌లో మళ్లీ హింస.. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి

మణిపూర్‌లో సెప్టెంబర్ 1 ఆదివారం మరోసారి హింసాత్మక ఘటనకు సంబంధించిన వార్త వెలుగులోకి వచ్చింది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో అనుమానిత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక మహిళతో సహా ఇద్దరు వ్యక్తులు మరణించగా, 9 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించగా, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి, ఉగ్రవాదులు కొండ ఎగువ ప్రాంతాల నుండి కొట్రుక్ లోయ, పొరుగున ఉన్న కడంగ్‌బండ్‌లోని దిగువ ప్రాంతాల వైపు కాల్పులు జరిపారు. బాంబులతో కూడా దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోగా, ఆమె ఎనిమిదేళ్ల కూతురు, ఓ పోలీసు అధికారితో సహా మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పలు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి.

వరద ముంపు నుంచి తేరుకొని బెజవాడ.. రంగంలోకి నేవీ హెలికాప్టర్..

వరద ముంపు నుంచి ఇంకా విజయవాడ నగరం తేరుకోలేదు. నగర శివారు ప్రాంతాలను కూడా బుడమేరు వాగు ప్రవాహం వదలి పెట్టలేదు. నున్న , గన్నవరం, సింగ్ నగర్ వెళ్ళే మార్గాలకు కనెక్టివిటీ కట్ అయింది. శివారు ప్రాంతాల్లో ఉన్న వందల ఎకరాలు ఖాలీ స్థలాలు, అపార్ట్ మెంట్లు ఇంకా నీటిలోనే మునిగిపోయాయి. మరోవైపు ఆగని వర్షంతో ప్రజలు, రెస్య్కూ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్ వచ్చి కాపాడాలని బాధితులు కోరుతున్నారు. అయితే, విజయవాడలో వరదలకు చిక్కుకున్న వారిని సురక్షితంగా తరలించేందుకు అధికారుల సన్నాహాలు చేస్తున్నారు. సింగ్ నగర్ నుంచి పడవలను తరలించి అక్కడ నుంచి ఇందిరా నాయక్ నగర్, రాజరాజేశ్వరరావుపేట తదితర ప్రాంతాల్లో వరద ప్రవాహంలో చిక్కుకున్న వారిని పడవల సాయంతో బయటకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 



[ad_2]

Related Articles

Back to top button
Close
Close