Tollywood: వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించిన ఎన్టీఆర్.. విశ్వక్ సేన్ కూడా

[ad_1]
తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం కొనసాగుతున్న విషయం తెలిసిందే. జనజీవనం అస్తవ్యస్తమైంది. కాలువలు, చెరువులకు గండిపడ్డాయి. వరదబారిన ప్రజలు ఆకలిదప్పులతో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వరద బాధితులకు సాయం అందించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కదిలివస్తున్నారు. వర్షాలు, వరదలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు హీరో జూనియర్ ఎన్టీఆర్ తనవంతుగా విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల చొప్పున మొత్తం కోటి రూపాయల విరాళాన్ని జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి…
— Jr NTR (@tarak9999) September 3, 2024
[ad_2]