Trending news

Tollywood: కత్తి పట్టిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. నిర్మాత కూడా..

[ad_1]

Tollywood: కత్తి పట్టిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. నిర్మాత కూడా..

పై ఫొటోలో కత్తి పట్టుకుని ఝాన్సీ లక్ష్మీ బాయిలా పోజులిస్తోన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఈ క్యూటీ ఒకప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. పదహారేళ్ల వయసులోనే కథానాయికగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ అందాల తార తెలుగులో టాప్ హీరోలతో నటించింది. ఓవైపు హీరోయిన్ గా నటిస్తూనే, మరోవైపు స్పెషల్ సాంగ్స్‌తోనూ కుర్రకారును కవ్వించింది. ఒక్క తెలుగులోనే కాదు కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ భాషల సినిమాల్లోనూ మెరిసి అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2002-15 మధ్య కాలంలో సుమారు దశాబ్దకాలం పాటు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ అందాల తార ఇప్పుడు నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకుంటోంది. స్టార్ హీరోలతో కలిసి పాన్ ఇండియా సినిమాలు చేస్తోంది. మరి ఈ క్యూటీ ఎవరో ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది. యస్. తనెవరో కాదు టాలీవుడ్ బబ్లీ బ్యూటీ ఛార్మీ. ఇది ఆమె చిన్ననాటి ఫొటో.

నీతోడు కావాలి అంటూ తెలుగు తెరకు పరిచయమైన ఛార్మీ శ్రీఆంజనేయం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నీకే మనసిచ్చాను, పౌర్ణమి, మంత్ర, చక్రం, మాస్, చంటి, గౌరి, రాఖీ, స్టైల్, కౌసల్య సుప్రజ రామా, మంగళ, జ్యోతి లక్ష్మి, మంత్ర 2 సినిమాల్లో నటించింది. ఇక 2015 తర్వాత యాక్టింగ్‌కు గుడ్ బై చెప్పిన ఛార్మి.. నిర్మాతగా సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించింది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాత్‌ తో కలిసి పూరీ కనెక్ట్స్ అనే ప్రొడక్షన్ సంస్థను ఏర్పాటు చేసి వరుసగా సినిమాలు నిర్మిస్తోంది.

ఛార్మీ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

 

View this post on Instagram

 

A post shared by Charmmekaur (@charmmekaur)

 

జ్యోతి లక్ష్మి సినిమాతో నిర్మాతగా మారింది ఛార్మి. ఆ తర్వాత రోగ్, పైసా వసూల్,  మెహబూబ్, ఇస్మార్ట్ శంకర్, రొమాంటిక్,  లైగర్ సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేసింది. అయితే ఇందులో చాలా సినిమాలు ఆడియెన్స్ ను నిరాశ పర్చాయి.    ఇటీవల ఎనర్జిటిక్ స్టార్ పోతినేని రామ్ హీరోగా ఛార్మీ నిర్మించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా  యావరేజ్ గా నిలిచింది. ఈ బ్యానర్ నుంచి నెక్ట్స్ ప్రాజెక్టుకుకు సంబంధించి ఇంకా అప్ డేట్ రావాల్సి ఉంది.

ఛార్మీ గ్లామరస్ ఫొటోస్..

 

View this post on Instagram

 

A post shared by Charmmekaur (@charmmekaur)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close