Tollywood: ఓర్నీ.. ఈ హీరోయిన్ అప్పటికంటే ఇప్పుడే బాగుందిగా.. సన్నజాజిలా..

[ad_1]

ఇప్పుడంటే దర్శకుడు శ్రీను వైట్ల వెనకపడ్డారు కానీ ఒకప్పుడు ఆయనతో సినిమా చేయాలని స్టార్ హీరోలు ఉవ్విళ్లూరేవారు. జోనర్ ఏదైనా అందులో పసందైన హస్యాన్ని జోడించి.. ఆడియెన్స్‌కు ఫుల్ మీల్స్ అందించేవారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన శ్రీను వైట్ల ప్రస్తుతం కెరీర్ బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నారు. ఆయన చేసిన సినిమాలన్నీ ప్లాఫ్ అవుతున్నాయి. ఇప్పుడు గోపీచంద్‌తో ఓ మూవీ చేస్తున్నాడు శ్రీను వైట్ల. ఇదిలా ఉంటే శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మంచి సినిమాల్లో సొంతం కూడా ఒకటి. ఇందులో ఆర్యన్ రాజేష్, రోహిత్ లీడ్స్ రోల్స్ చేశారు. ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో నమిత మెయిన్ హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన భామ మీకు గుర్తుందా.? సౌమ్య పాత్రలో క్యూట్ లుక్స్‌తో యూత్‌ను ఆకట్టుకుంది ఆ చిన్నది. తన పేరు పేరు నేహా పెండ్సే.
సొంతం సినిమాలో రోహిత్ ప్రేయసిగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది ఈ నటి. ఆ సినిమా వచ్చిన సమయంలో ఆమె వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమేనట. ఆతర్వాత మరాఠీ, హిందీ, కన్నడ, మలయాళం ఇలా చాలా సినిమాల్లో నటించింది. తెలుగులో అయితే మంచి అవకాశాలు రాలేదు. ఇక ఈ అమ్మడు పెళ్లి తర్వాత చిత్ర పరిశ్రమకు దూరమైంది. 2020లో ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్.. మళ్లీ వెండితెరపై కనిపించలేదు. అటు బుల్లితెరపై మాత్రం సీరియల్స్‌లో నటిస్తూనే ఉంది. కాగా నేహా.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్. రెగ్యులర్‌గా ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌తో టచ్‌లో ఉంటోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
[ad_2]