Tollywood : ఏంటీ..! ఈ నటుడి తమ్ముడు తెలుగులో క్రేజీ హీరోనా..!

[ad_1]
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు ఒకరికొకరు బంధువులు అవుతారని చాలా మందికి తెలియదు. అలాగే ఓ తమిళ్ స్టార్ నటుడి తమ్ముడు తెలుగు హీరో అని కూడా చాలా మందికి తెలియదు. ఆ తమిళ నటుడే సునీల్ రెడ్డి.
సునీల్ రెడ్డి ఈ పేరు చెప్తే టక్కున గుర్తుపట్టలేరు కానీ ఆయన్ను చుస్తే మాత్రం ఓహో ఈయన అని కనిపెట్టేస్తారు. కామెడీ విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సునీల్ రెడ్డి. ఈయన తెలుగువాడే అయినప్పటికీ తమిళ్ లో సినిమాలు చేసి పాపులర్ అయ్యాడు.
మూడేళ్ళ క్రితం వచ్చిన వరుణ్ డాక్టర్ సినిమాలో ఏ సునీల్ రెడ్డి మహాలి అనే పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమాలో అతను తన కామెడీతో నవ్వులు పూయించాడు. అలాగే జైలర్ సినిమాలో తమన్నా లవర్ గా కనిపించాడు.
వీటితో పాటు దళపతి విజయ్ బీస్ట్ సినిమాలోనూ నటించాడు. ఇలా తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు సునీల్ రెడ్డి. అయితే ఆయన తమ్ముడు తెలుగులో హీరోగా చేశాడని చాలా మందికి తెలియదు.
అతను ఎవరో కాదు వైభవ్. అవును ఈ యంగ్ హీరో తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. కానీ హీరోగా అంతగా సక్సెస్ కాలేకపోయాడు. దాంతో సెకండ్ హీరోగా.. సహాయక పాత్రల్లో నటిస్తున్నాడు. రీసెంట్ గా గోట్ సినిమాలో విజయ్ ఫ్రెండ్ గా నటించాడు వైభవ్.
[ad_2]