Trending news

Tollywood: అన్నంలో ఐస్‌క్రీమ్ కలుపుకొని తిన్న స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

[ad_1]

పై ఫొటోలో ఐస్‌క్రీమ్ వెనకాల ఉంటూ ముఖం చూపించకుండా దాగుడు మూతలు ఆడుతున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా? ఈ అమ్మడు టీవీ సీరియల్స్ తో కెరీర్ మొదలెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే స్టార్ స్టేటస్ అందుకుంది. తన అందం, అభినయంతో కుర్రాళ్ల మనసులకు గాలం వేసింది. ప్రస్తుతం అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లోనూ టాప్ రేంజ్ లో దూసుకుపోతోందీ అందాల తార. ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన అభిమానుల కోసం ఎప్పుడూ ఏదొ ఒక ఫోటో షేర్ చేస్తూనే ఉంటుంది. అలా ఆమె షేర్ చేసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐస్ క్రీం తో ఉన్న ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఈ సొగసరి ఊప్స్ అని క్యాప్షన్ ఇచ్చింది. ఇది క్షణాల్లోనే బాగా వైరల్ అయింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఐస్ క్రీమ్ ఓకే కానీ, ఫేస్ కూడా కొంచెం చూపియమ్మా అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. మరీ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా? అయితే మీకో క్లూ.. ఈ ముద్దుగుమ్మ ఇటీవలే న్యాచురల్ స్టార్ నాని, టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ దేవరకొండలతో స్క్రీన్‌ షేర్ చేసుకుంది. సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. ఇటీవలే ప్రభాస్ కల్కిలోనూ ఓ స్పెషల్ రోల్ చేసింది. ఈ పాటికే అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్ .. ఈ ఐస్ క్రీం బ్యూటీ మరెవరో కాదు మృణాళ్ ఠాకూర్.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే మృణాళ్ తాజాగా ఈ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. కానీ ముఖం చూపించకుండా అభిమానులతో దాగుడు మూతలు ఆడుకుంది. ఇటీవలే ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమాలో దివ్యగా అతిథి పాత్ర పోషించింది మృణాళ్. ప్రస్తుతం ఆమె చేతిలో ఏకంగా అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న.. విశ్వంభర సినిమాలో కూడా మృణాల్ ఠాకూర్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. బాలీవుడ్ లో పూజా మేరీ జాన్, హై జవానీ తో ఇష్క్ హోనా హై సినిమాల్లో నటిస్తోంది .అలాగే అజయ్ దేవ్‌ సన్ ఆఫ్ సర్దార్ 2 లోనూ మృణాళ్ నటించనుంది.

ఇవి కూడా చదవండి

ఐస్ క్రీమ్ తో మృణాళ్ ఠాకూర్..

కాగా గతంలో ‘మీరు తిన్న విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్ ఏంటి’ అని మృణాళ్ కు ఒక ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె అన్నంతో ఐస్ క్రీమ్ అని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఆ కాంబినేషన్ బాగుంది అని కూడా తెలిపింది.

మృణాళ్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close