Trending news

Today Gold Price: తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు.. నిన్నటితో పోల్చితే ఎంతో తెలుసా.?

[ad_1]

Today Gold Price: బంగారం ధరలో ప్రతీ రోజూ హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఓరోజు పెరిగితే, మరో రోజు తగ్గుతున్నాయి. బుధవారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. సోమవార ఉదయంతో పోల్చితే ఈరోజు తులంపై సుమారు రూ. 10 వరకు తగ్గింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 73,020కి చేరువైంది. మరి ఈరోజు దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,170 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా ఆర్థిక రాజధాని ముంబయి విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,930కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,020 వద్ద కొనసాగుతోంది.

ఇక చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,930, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,020 వద్ద కొనసాగుతోంది. బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,930కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,020 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,930కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 73,020 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడతో పాటు, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వెండి ధరలు మాత్రం పెరిగాయి. బుధవారం కిలో వెండిపై రూ. 100లు పెరిగింది. దీంతో ఢిల్లీతోపాటు ముంబయి, కోల్‌కతా, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 88,600గా ఉండగా.. చెన్నై, కేరళ, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో అత్యధికంగా రూ. 93.600 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

[ad_2]

Source link

Related Articles

Back to top button
Close
Close