TravelTrending newsViral news

The world record-breaking Kaleshwaram Project is a 49-km tunnel

ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ 49 కిలోమీటర్ల సొరంగం

తెలంగాణలోనే అత్యంత అభివృద్ధి నగరంగా హైదరాబాద్‌ తరువాత వరంగల్‌ పేరు పొందింది. ఇప్పటికే ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నా రికార్డులు సృష్టించారు. ఇక్కడ దేవాలయాలకు, పురాతన కట్టడాలకు ప్రపంచ వ్యాప్తంగా పరుంది. అయితే మన వరంగల్‌ మరో కొత్త రికార్డును సృష్టించబోతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో నిర్మించింది. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా ఆసియాలోనే అతి పొడవైన హైడ్రాలిక్‌ టన్నెల్‌ నిర్మాణ పనులు శరవేగంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి కొనసాగుతున్నాయి.

ఇలాంటి మహోన్నతమైన ప్రాజెక్టు ములుగు జిల్లా రామప్ప నుంచి మొదలై వరంగల్‌ అర్బన్‌ జిల్లా దేవన్నపేట (ధర్మసాగర్‌) వద్ద ముగియనుంది, ఈ సారంగం పొడవు 49 కిలోమీటర్లుగా ఉంది. ఇప్పటికే 44.7 కిలోమీటర్ల సొరంగం పూర్తయింది. దేవన్నపెట వద్ద నిర్మిస్తున్న సర్ట్‌ పూల్‌, పంప్‌హౌజ్‌ సైతం ఆసియాలోనే అతిలోతైనవి
కావడం మరో రికార్డు కావడం విశేషం. 143 మీటర్ల లోతులో వీటిని నిర్మిస్తున్నారు. ఆసియాలోని సారంగమార్గాల్లొ బస్‌వేలు, రైల్వేలున్నా నీటిని తరలించేందుకు దేవాదులకు మించిన పొడవైన సొరంగమార్గం మరెక్కడా లేదని నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. దేవాదుల మూడోదశ పనుల్లొ ప్రధానమైన సొరంగ
మార్గాన్ని నిర్మిస్తున్నారు.

ములుగు, వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల గుండా (రామప్ప, బండారుపల్లి, ఇంచెం చెరువుపల్లి, అబ్బాపూర్‌,
గొరికొత్తపల్లి, వసంతాపూర్‌, మాందారిపిట, మైలారం, ల్యాదెళ్ల, సిద్దాపూర్‌, పెగడపల్లి, భీమారం, దేవన్నపేట) ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ వరకు ఈ సొరంగం వెళ్తుంది. రామప్ప నుంచి దేవన్నపట వరకు 49.06 కిలోమీటర్లు. ఇందులో సాఫ్టరాక్‌ టన్నెల్‌ 7.6 కిలోమీటర్లు కాగా, హార్డ్‌రాక్‌ 41.24 కిలోమీటర్లు. ఇందులో సాఫ్టారాక్‌ 4. / కిలోమీటర్లు, హార్ట్‌రాక్‌ టన్నెల్‌ దాదాపు 40 కిలోమీటర్ల మేర పూర్తయ్యింది. రామప్ప వద్ద భూ ఉపరితలం నుంచి తక్కువ లోతులో ప్రారంభమై హసన్‌పర్తి మండలం భీమారం వద్ద 114 మీటర్ల లోతు నుంచి సౌరంగం తవ్వుతున్నారు. అది ధర్మసాగర్‌ వరకు 1 65 మీటర్లకు చేరుతుంది. శాయంపెిట మండలం చలివాగు కింది (22.8 మీటర్ల లోతులో) నుంచి ఈ సొరంగం తవ్వుతున్నారు. ఈ మార్గంలో ఎనిమిది షాఫ్టిలు (పెద్ద బావిలాగా) నిర్మించారు. ఒక్కో ష్ట్ర | ౮ మీటర్ల వ్యాసార్థంలో ఉంటుంది. 10 ఆడిట్‌ పాయింట్లు ఏర్పాటుచేశారు. ఆడిట్‌ పాయింట్‌ నుంచి నేరుగా సౌరంగంలోకి భారీ వాహనాలు వెళ్లేందుకు అనువుగా (ర్యాంప్‌) ఉంటుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close