Trending news

TGPSC Group 3: టీజీపీఎస్సీ గ్రూప్‌-3 అభ్యర్ధులకు మరో ఛాన్స్‌.. నేటి నుంచి దరఖాస్తుల సవరణకు అవకాశం

[ad_1]

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2: తెలంగాణలో గ్రూప్‌-3 పోస్టులకు గత ఏడాది డిసెంబరు 30న టీజీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23వ తుదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,36,477 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విడుదలైన తొలి గ్రూప్‌-3 నియామక నోటిఫికేషన్‌ ఇదే కావడం గమనార్హం. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1,388 గ్రూప్ 3 పోస్టులను భర్తీ చేయనున్నారు. అప్పటి నుంచి రాత పరీక్షల షెడ్యూల్ విడుదలకాలేదు.

అయితే తెలంగాణలో గ్రూప్‌-3 దరఖాస్తుల సవరణకు టీజీపీఎస్సీ మరో అవకాశం కల్పించింది. సెప్టెంబర్‌ 2 నుంచి అంటే ఈ రోజు నుంచి సెప్టెంబర్‌ 6వ తేదీ వరకు దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇప్పటికే కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఎడిట్‌ ఆప్షన్‌ కూడా ప్రారంభమైంది. అభ్యర్ధుల దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు దొర్లితే సరిచేసుకోవాలని సూచించింది. ఈ అవకాశాన్ని అభ్యర్ధులందరూ తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా పేర్కొంది. కాగా టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.

గ్రూప్ 3 రాత పరీక్ష మొత్తం మూడు పేపర్లకు ఉంటుంది. మూడు పేపర్లకు గానూ 450 మార్కులకు గ్రూప్‌ 3 రాత పరీక్షలు జరుగుతాయి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష ప్రశ్నా పత్రం ఇస్తారు. అన్ని జిల్లా కేంద్రాల్లో గ్రూప్‌ 3 పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్‌ ఇప్పటికే ప్రకటించింది. టీజీపీఎస్సీ పరిధిలో ఇప్పటికే పలు పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న రాష్ట్ర సర్కార్‌.. ఈపరీక్షలను కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్‌ 3వ తేదీన మహిళా డిగ్రీ కాలేజీలో ఉద్యోగ మేళా

విశాఖపట్నంలోని ఎం.వి.పి. కాల‌నీలోని జైలురోడ్డులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ నెల 3న ఉద్యోగ మేళా జరుగుతుందని నైపుణ్యాభివృద్ధి అధికారి సాయికృష్ణ చైతన్య తెలిపారు. ఇందులో టెక్‌విన్సెన్, విన్స్, ఏటీసీ టైర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. నిరుద్యోగ యువత ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 99669 65502 ఫోన్‌ నెంబరును సంప్రదించాలని సూచించారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

[ad_2]

Related Articles

Back to top button
Close
Close