Trending news

TG Schools Holiday: తెలంగాణలో భారీ వర్షాల ఎఫెక్ట్‌.. విద్యాసంస్థలకు సెలవు

[ad_1]

తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లరాదని హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అటు ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. తెలంగాణకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించడంతో సహాయక బృందాలను రంగంలోకి దింపింది ప్రభుత్వం. ముఖ్యంగా హైదరాబాద్‌ వాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారంలో అప్రమత్తమయ్యారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహాయక బృందాలను రంగంలోకి దింపింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ కలెక్టర్ ప్రకటన జారీ చేశారు. అయితే ఈ భారీ వర్షాల నేపథ్యంలో మరిన్ని సెలవులు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

భాగ్యనగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. అధికారులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిరంతరం విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

హైదరాబాద్ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌

హైదరాబాద్ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఏమైనా సమస్యలుంటే ప్రజలు 040-23202813, 9063423979 నెంబరుతో పాటు ఆర్డీవో హైదరాబాద్ 7416818610, 9985117660, సికింద్రాబాద్ ఆర్డీవో ఫోన్ నెంబర్ 8019747481లకు సంప్రదించాలని సూచించారు.

పాఠశాలసెలవులపై కలెక్టర్లదే నిర్ణయం: సీఎస్

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాగల 48 గంటల పాటు తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని 9 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీచేసింది. భారీ వర్షాల నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సూచించారు. అలాగే భారీగా వర్షాలు కురిసే జిల్లాల్లో అవసరమైతే ముందస్తుగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలన్నారు. పాఠశాలలకు సెలవుపై పూర్తిగా నిర్ణయాధికారం కలెక్టర్లదే అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

[ad_2]

Related Articles

Back to top button
Close
Close