TG Governor: సంక్షేమ పథకాలు అందరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి..

[ad_1]

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో చివరి వ్యక్తికి అందేలాగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అధికారులకు సూచించారు. పెద్ద పెద్ద నగరాల్లో ఉన్న వారికే కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అట్టడుగు వర్గాల వారికి కూడా సంక్షేమ పథకాలు అందేలాగా చూడాలని గవర్నర్ సూచించారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ములుగు జిల్లాలో అధికార యంత్రాంగం చేపట్టిన అభివృద్ధి పనులు క్రింది స్థాయి వారికి చేరేలాగా తీసుకున్న చర్యలని గవర్నర్ అభినందించారు.
Kolkata Doctor Murder: సచివాలయం ముట్టడికి జూనియర్ వైద్యులు మద్దతు ఎందుకు ఇవ్వలేదు?
మంత్రి సీతక్క చొరవ.. మాతా శిశు మరణాలను తగ్గించిన విధానాన్ని జిల్లా అధికారులు గవర్నర్కి తెలిపారు. సంక్షేమ శాఖ నుంచి పేదలకు అందిస్తున్నటువంటి పథకాలను వివరాలని గవర్నర్కి జిల్లా కలెక్టర్ వివరించారు. 80 గ్రామాల్లో ముంపు కారణంతో నష్టం జరిగిన వారికి ముందస్తుగా చేపట్టిన చర్యలు ఎలాంటి ఫలితాలు వచ్చాయో జిల్లా అధికారులు గవర్నర్కి వివరించడంతో జిల్లా యంత్రాంగాన్ని అభినందించడంతో పాటు మంత్రిని అభినందించారు. గవర్నర్ గతంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మంత్రిగా పనిచేసిన తనకి ములుగు జిల్లాలో చరిత్ర ఆకట్టుకుంది అన్నారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో మంత్రిత్వ శాఖలో పనిచేసిన తనకి మంత్రి చేపట్టిన చర్యలు సంతోషం ఇస్తున్నాయని సూచించారు.
Advocate Mohit Rao: ఈడీ కేసుపై కవిత న్యాయవాది కీలక వ్యాఖ్యలు..
అనంతరం.. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రామప్ప ఆలయాన్ని సందర్శించారు. రామప్ప దేవాలయం చాలా సుందరమైన దేవాలయం.. ఇలాంటి దేవాలయం దేశంలో మరో చోట లేదని అన్నారు. రామప్ప దేవాలయాన్ని చూడడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. యునెస్కో గుర్తింపు ఎప్పుడో రావాల్సినటువంటి గుడి అని కొనియాడారు. రామప్ప టెంపుల్ చాలా బాగుందని.. మరోసారి కుటుంబ సమేతంగా రామప్ప దేవాలయానికి రావాలనుకుంటున్నట్లు గవర్నర్ చెప్పారు.
[ad_2]
Source link