Trending news

Telangana Rain Alert: వాయుగుండంగా అల్పపీడనం.. జాగ్రత్తగా ఉండండి.. వాతావరణ శాఖ హెచ్చరిక

[ad_1]

నిన్నటి వరకు కొనసాగిన తీవ్ర అల్పపీడన ద్రోణీ ఈరోజు(ఆగస్ట్ 31) ఉదయం వాయుగుండంగా బలపడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న వాయు బంగాళాఖాతం అలాగే ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిస్సా తీరాల వెంబడిగా కేంద్రీకృతమై ఉంది. అయితే దీని దిశ పశ్చిమ వాయు దిశగా వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సుమారు 80 కిలోమీటర్ల వేగంతో కలింగపట్నం కు 120కిలోమీటర్ల తూర్పు దిశగా కేంద్రీకృతం అయి ఉంది. అయితే దీని ప్రభావం తెలంగాణ ప్రాంతంలో రానున్న రెండు రోజుల్లో పాటు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ, రేపు రెండు రోజులపాటు తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఎల్లుండి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతుంది.

తెలంగాణ లోని ఏడు జిల్లాకు రెడ్ వార్నింగ్ జారీ అయింది. పెద్దపల్లి కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి ఖమ్మం నల్గొండ లాంటి ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల 20సెంటిమెటర్ల వర్ష పతం నమోదు ఆయ్యే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఈ రోజు రాత్రి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ అధికారి నాగరత్నం వెల్లడించారు.

సంగారెడ్డి వికారాబాద్ కు ఆరంజ్ అలెర్ట్ జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా అత్యవసర అయితే బయటకు రావద్దని సూచిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులతోపాటు పోలీసులు అప్రమత్తమయ్యారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల పై సమాచారం అందగానే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం వార్తల ఇక్కడ క్లిక్ చేయండి.. 

[ad_2]

Related Articles

Back to top button
Close
Close