Trending news

Telangana project: ఎడతెరిపిగా కురుస్తున్న వర్షాలు.. ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం..

[ad_1]

  • మూడు రోజులుగా భారీ వర్షాలు..

  • తెలంగాణలో ప్రాజెక్టుకు వరద ప్రవాహం
Telangana project: ఎడతెరిపిగా కురుస్తున్న వర్షాలు.. ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం..

Telangana project: మూడు రోజులుగా భారీ వర్షాలు పడుతుండడంతో తెలంగాణలో ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాల వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో కురిసిన భారీ వర్షాలు సోమవారం నాటికి తగ్గుముఖం పట్టినా ముసురు మాత్రం ఎడతెరిపి లేకుండా పోతోంది. సోమవారం రాత్రి 9 గంటల వరకు నగరంలోని నాగోల్‌లో అత్యధికంగా 1.33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

Read also: Medak Temple: మూడో రోజు జలదిగ్బంధంలో ఏడు పాయల వనదుర్గ ఆలయం

ఇప్పటికే తీరం దాటిన వాయుగుండం 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాగల మరో మూడు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో తెలంగాణకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

హుస్సేన్ సాగర్ కు కొనసాగుతున్న వరద..

హుస్సేన్ సాగర్ కు వరద కొనసాగుతుంది. బంజారా, పికేట్, కూకట్పల్లి నాళాల నుండి హుస్సేన్ సాగర్ లోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. ఫుల్ ట్యాంక్ లెవెల్ మించడంతో దిగువకు విడుదల చేస్తున్న అధికారులు. ప్రస్తుతం వాటర్ ఇన్ ఫ్లో 2307 క్యూసేక్స్ కాగా..1751 క్యుసెక్స్ వాటర్ ఔట్ ఫ్లో ఉంది. హుస్సేన్ సాగర్ FTL కెపాసిటీ +513.41 కాగా.. ప్రస్తుతం +513.59 కి చేరింది.

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు పోటెత్తిన వరద..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు వరద పోటెత్తింది. బ్యారేజ్ లోని పూర్తిగా 85 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8,52,240 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ఇక కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. 11.490 మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్ ను తాకుతు వరద ప్రవహిస్తుంది. మొదటి ప్రమాద హెచ్చరికకు దగ్గరలో ఉభయ నదులు ప్రవహిస్తున్నాయి. ఇక అన్నారం సరస్వతీ బ్యారేజ్ కు వరద పోటెత్తింది. బ్యారేజ్ లోని పూర్తిగా 66 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,92,543 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.

Read also: Heavy Rain: వాతావరణ శాఖ మరో హెచ్చరిక.. మూడు రోజుల్లో మరో ముప్పు..

ఖమ్మం జిల్లా మున్నేరు తగ్గుతున్న వరద..

ఖమ్మం జిల్లా మున్నేరుకు భారీగా వరద తగ్గుతుంది. రెండు రోజుల క్రితం 36 అడుగులకు మున్నేరు వాగుకు వరద చేరుకుంది. ప్రస్తుతం 11 అడుగుల కు చేరుకున్న వరద. ఇంకా బురద లోనే ఇళ్లులు ఉండటంతో బాధితులు ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు.

మిడ్ మానేరు ప్రాజెక్టుకు పోటెత్తుతున్న వరద..

రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. 46433 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కాగా.. మానేరు, మూలవాగు నుంచి ప్రాజెక్టు కి 37180 క్యూసెక్కుల ఇన్ ఫ్లో. ఎల్లంపల్లి నుంచి నంది గాయత్రి పంప్ హౌస్ ద్వారా 1050 క్యూసెక్కులు, ఎస్సారెస్పీ 2960లుగా కొనసాగుతుంది. మిడ్ మానేరు నుంచి అన్నపూర్ణ ప్రాజెక్టు కి 6400 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 27.54 టీఎంసీలు కాగా ప్రస్తుతం 20.52 టిఎంసిలకు చేరిన నీటి నిల్వ.

Read also: TGS RTC: భారీ వానలు.. తెలంగాణలో 1400 బస్సులు రద్దు..

ఎల్లంపల్లి ప్రాజెక్టు అప్ డేట్స్..

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎల్లంపల్లి ప్రాజెక్టు స్థాయి : 148.00 మీటర్లు కాగా.. ప్రస్తుత స్థాయి : 145.69 మీటర్లుగా కొనసాగుతుంది. ప్రాజెక్టు సామర్థ్యం : 20.175 TMC కాగా.. ప్రస్తుత సామర్థ్యం : 14.181 TMC, ప్రాజెక్టు ఇన్ ఫ్లో : 5,82,491 క్యూసెక్కులు. ప్రాజెక్టు ఔట్ ఫ్లో : 5,20,491 క్యుసెక్కులు. ప్రాజెక్టు మొత్తం గేట్లు : 62, ప్రస్తుతం ఓపెన్ చేసిన గేట్లు : 32.

జూరాలకు వరద ఉదృతి..

మహబూబ్ నగర్ జిల్లా జూరాలకు వరద ఉదృతి పెరగడంతో.. 40 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ ఫ్లో : 3,25,920 వేల క్యూ సెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 3,25,029 వేల, క్యూ సెక్కులుగా కొనసాగుతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం :1045 ఫీట్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం :1042.323 ఫీట్లుగా కొనసాగుతుంది. పూర్తి నీటి సామర్థ్యం: 9.657 టీఎంసీలుగా కొనసాగుతుంది. ప్రస్తుత నీటి నిల్వ: 8.029 టీఎంసీలుగా ఉంది. ఎగువ జూరాల కేంద్రంలో 5 యూనిట్లలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.. ఎత్తి పోతల పథకాలకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు.

Read also: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు..

నీట మునిగిన పాలమూరు రంగారెడ్డి పంప్ హౌస్..

నాగర్ కర్నూల్ జిల్లా పాలమూరు రంగారెడ్డి పంప్ హౌస్ నీట మునిగింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన వట్టెం వద్ద వరద నీరు టన్నెల్ నుంచి సర్జిపూల్ కు , పంప్ హౌస్ కు వరద నీరు చేరింది. దీంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పంప్ హౌస్ నీట మునిగింది. అధికారులు నీటిని తోడుతున్నారు. పూర్తిస్థాయిలో నీరు తీస్తేనే నష్టం అంచనా తెలుస్తుందని చెబుతున్నారు అధికారులు.

సింగూరు ప్రాజెక్టుకు కొనసాగుతున్న ఇన్ ఫ్లో..

సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇన్ ఫ్లో- 24845 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో- 401 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రస్తుత నీటి మట్టం- 20.531 TMC లు కాగా.. పూర్తిస్థాయి నీటిమట్టం- 29.917 TMC లుగా కొనసాగుతుంది.
Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌



[ad_2]

Related Articles

Back to top button
Close
Close