Sports newsTop newsTrending newsViral news

Telangana Group-1 Group-2 full details 2022 || Group-1 Group-2 Exam Interview Cancelled In Telangana 2022

తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. ఇంటర్వ్యూలు లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు (Govt Jobs 2022) పొందే అవకాశం కల్పించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు ఇంటర్వ్యూలు తొలగించనుంది.

 

 

 

 

 

Telangana Govt Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్… ఇంటర్వ్యూలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు
Telangana Govt Jobs | తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. ఇంటర్వ్యూలు లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు (Govt Jobs 2022) పొందే అవకాశం కల్పించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు ఇంటర్వ్యూలు తొలగించనుంది. దీంతో ఇక ఏ ప్రభుత్వ ఉద్యోగానికి ఇంటర్వ్యూ లేనట్టే.

 

1. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఉద్యోగాల భర్తీ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు (TSPSC Group 1 Group 2 Jobs) ఇంటర్వ్యూలు తొలగిస్తూ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే దీనిపై చర్చలు జరుగుతున్నాయి. న్యాయనిపుణులు, TSPSC అధికారులతో చర్చించిన తర్వాత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.

2. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు ఇంటర్వ్యూలు తొలగిస్తూ ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో జీవో విడుదల చేసే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలు తొలగించడానికి కేబినెట్ ఆమోదం అవసరమా లేదా అన్న అంశంపైనా చర్చ జరుగుతోంది. అయితే పోటీ పరీక్షల నిర్వహణ బాధ్యతల్ని టీఎస్‌పీఎస్‌సీ చూస్తుంది కాబట్టి టీఎస్‌పీఎస్‌సీ నిర్ణయం సరిపోతుందన్న వాదన వినిపిస్తోంది.

3. దాదాపు మిగతా అన్ని ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు లేవు. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు కూడా ఇంటర్వ్యూలు తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ ఊరట కలిగించినట్టే. అదే జరిగితే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు అన్నింటినీ ఇంటర్వ్యూ లేకుండా పొందొచ్చు. రెండు రోజుల్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.

4. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు వచ్చేలా కొత్త జోనల్ విధానం అమలు చేస్తోంది. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు ఇంటర్వ్యూలు తొలగించబోతోంది. గ్రూప్ 1 పోస్టుల్లో ఇంటర్వ్యూకు 100 మార్కులు, గ్రూప్ 2 పోస్టుల్లో ఇంటర్వ్యూకు 75 మార్కులు ఉన్నాయి.

5. తెలంగాణ ప్రభుత్వం 503 గ్రూప్ 1 పోస్టుల్ని, 582 గ్రూప్ 2 పోస్టుల్ని, 1,373 గ్రూప్ 3 పోస్టుల్ని, 9,168 గ్రూప్ 4 పోస్టుల్ని భర్తీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులకు ఇంటర్వ్యూలు ఎలాగూ ఉండవు. ఇక గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు కూడా ఇంటర్వ్యూలు లేనట్టే. ఇంటర్వ్యూలు తొలగిస్తే ఈ మార్కులకు అదనంగా ప్రశ్నలు ఉంటాయా? లేక ఈ మార్కులు తొలగించి మిగతా మార్కులతోనే రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తారా అన్నది చూడాలి.

6. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇంటర్వ్యూలను తొలగించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇంటర్వ్యూల కారణంగా అవినీతి జరుగుతుందని, ప్రతిభావంతులైన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు రావట్లేదన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. ఇంటర్వ్యూలు తొలగిస్తే ప్రతిభ ఉన్నవారికి ఉద్యోగాలు లభిస్తాయన్న వాదన ఉంది.

7. తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏప్రిల్‌లోనే రావొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి, జూలై చివరి వారంలో లేదా ఆగస్టులో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారని, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు 90 రోజులు ప్రిపరేషన్ సమయం ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.

 

8గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ నుంచి మెయిన్స్‌కు మధ్య 90 నుంచి 100 రోజుల సమయం ఉండనుంది. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అక్టోబర్ లేదా నవంబర్‌లో ఉంటాయి. మెయిన్స్ ఫలితాలు విడుదలైన తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.

 

 

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close