Trending news

suriya : కంగువా ఓవర్సీస్ పబ్లిక్ రివ్యూ.. సూర్య హిట్ కొట్టాడా..?

[ad_1]

Suriya Kangua Overseas Public Review Has Suriya Hit

తమిళ స్టార్‌ హీరో సూర్య హీరోగా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పీరియాడికల్‌ యాక్షన్‌ ఫిలింగా తెరకెక్కిన ఈ సినిమాకు వీరం, విశ్వాసం, వివేకం వంటి హిట్ చిత్రాల శివ దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్‌ నటుడు బాబీ డియోల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో నిర్మాత జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌లు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. నేడు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో విడుదలైంది.

కాగా ఓవర్సీస్ లో గత అర్ధరాత్రి ప్రీమియర్స్ తో కంగువ విడుదలైంది. ఓవర్సీస్ టాక్ గమనిస్తే ‘ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చే ఎంట్రీతో సూర్య అదరగొట్టాడు. ఇక సినిమాలో స్టార్టింగ్ బ్లాక్స్ సూపర్ గా ఉన్నాయి మరియు పీరియాడిక్ ఇంట్రడక్షన్ సీక్వెన్సులు నెక్ట్స్ లెవల్ లో చిత్రీకరించాడు శివ. భారీ సన్నివేశాలు ఆకట్టునే విజువల్స్ తో గ్రాండియర్ గా  ఉంది, కానీ అక్కడక్కడ కాస్త నెమ్మిదించింది. ఇక సెకండ్ హాఫ్ లోని యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి. క్లైమాక్స్ సప్రైజ్ ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారు. ఓవరాల్ గా చుస్తే కంగువ ఆకట్టుకునే సినిమా. సూర్య తన పాత్రలో అద్భుతంగా చేసాడు. సినిమాలో అక్కడక్కడా కొన్ని మంచి బ్లాక్‌లు ఉన్నాయి కానీ మధ్యలో చాలా ఫ్లాట్‌గా అనిపిస్తుంది. ఇలాంటి సినిమాకి కావాల్సిన ఎమోషనల్ కనెక్టివిటీ  కొద్దిగా మిస్సయింది. దర్శకుడు శివ ఫస్ట్ హాఫ్‌లో స్క్రీన్‌ప్లేను రేసీగా నడిపాడు, కానీ సెకండాఫ్‌లో యాక్షన్ పైనే ఎక్కువ ద్రుష్టి పెట్టాడు. BGM దేవిశ్రీ అనుకున్న స్థాయిలో లేదని టాక్ వినిపిస్తోంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. పూర్తి  డిటైల్డ్ రివ్యూ మరి కొద్దీ సేపట్లో ప్రచురించబడుతుంది.

[ad_2]

Related Articles

Back to top button
Close
Close