Make moneyPolitical newsSports newsTop newsTrending newsViral news

Suicide

పిల్లలతో కలిసి నదిలోకి దూకిన ఆర్మీ జవాన్ భార్య..

[ad_1]

  • అస్సాంలో విషాదం
  • తన ఇద్దరు పిల్లలతో కలిసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ జవాన్ భార్య
  • బోగిబీల్ బ్రిడ్జి టి-పాయింట్ సమీపంలో మహిళ.. పిల్లల వస్తువుల గుర్తింపు
  • ఆత్మహత్యేనని పోలీసుల అనుమానం.
Suicide: పిల్లలతో కలిసి నదిలోకి దూకిన ఆర్మీ జవాన్ భార్య..

అస్సాంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఆర్మీ జవాన్ భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి బ్రహ్మపుత్ర నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్కు ముందు వాట్సాప్‌లో ‘సారీ పిల్లలు’ అని రాసింది. ఈ క్రమంలో.. దిబ్రూగఢ్‌లోని బోగిబీల్ బ్రిడ్జి టి-పాయింట్ సమీపంలో మహిళ, ఆమె పిల్లల కొన్ని వస్తువులను పోలీసులు గుర్తించారు. ఇది ఆత్మహత్యేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై.. దిబ్రూఘర్ జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ సిజల్ అగర్వాల్ ఈరోజు సమాచారం ఇచ్చారు. ఇది ఆత్మహత్యేనని.. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని తెలిపారు.

Aay: ఏపీ వరద బాధితులకు ‘ఆయ్’ సాయం.. ఎంతంటే?

నదిలో దూకిన వారి కోసం ‘స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డిఆర్‌ఎఫ్)ని రెస్క్యూ ఆపరేషన్ కోసం చేపడుతున్నాయి. అయితే 24 గంటలు గడిచినా మహిళ, పిల్లల ఆచూకీ లభించలేదు. కాగా.. మహిళ టి పాయింట్‌ వద్దకు వెళ్లడాన్ని తాము చూశామని స్థానికులు చెప్పారు. బ్రహ్మపుత్ర నదిలో దూకే ముందు పిల్లలను తన శరీరానికి కట్టుకుందని తెలిపారు. మృతురాలి భర్త అరుణాచల్‌లోని దిగువ సియాంగ్ జిల్లాలో ఉన్న భారత సైన్యం యొక్క లికాబాలి ప్రధాన కార్యాలయంలో జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ (GREF) అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఘటనపై నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తమకు సమాచారం అందగా.. అతను వెంటనే దిబ్రూగఢ్ చేరుకున్నాడు.

Telangana Rains: రేపు 11 జిల్లాల్లో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులపై కీలక ఆదేశాలు

GREF అధికారి నాగనాథ్, మహారాష్ట్ర నివాసి. తన భార్య ఎందుకు ఇలాంటి చర్య తీసుకుందో తనకు తెలియదని భర్త తెలిపాడు. ఇప్పుడు తన జీవితం కూడా ముగిసినట్లే అనిపిస్తోందని చెప్పారు. నేను నా కుటుంబం మొత్తాన్ని కోల్పోయాను.. తన పిల్లల్లో ఒకరికి 7 ఏళ్లు, మరొకరికి 5 ఏళ్లు అని నాగనాథ్ తెలిపారు. కాగా.. తన భార్య పిల్లల చిత్రాలను నిన్న వాట్సప్ లో పంపించిందని.. క్యాప్షన్‌లో రాసిన మాటలు అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పాడు. తాను తన భార్యతో మాట్లాడటానికి ప్రయత్నించాను, కానీ ఆమె స్పందించలేదని నాగనాథ్ పేర్కొన్నాడు.

Tags

Related Articles

Back to top button
Close
Close