Trending news

Stock market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

[ad_1]

  • లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

  • కలిసొచ్చిన అంతర్జాతీయ మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు
Stock market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. ప్రస్తుతం మార్కెట్‌లో వరుస జోరు కొనసాగుతోంది. గత వారం రికార్డులు సృష్టించిన సూచీలు.. ఈ వారం కూడా అదే జోరును సాగిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు కారణంగా మన మార్కెట్ ఉదయం లాభాలతో ప్రారంభమైంది. చివరి దాకా సూచీలు గ్రీన్‌లో కొనసాగాయి. సెన్సెక్స్ 194 పాయింట్లు లాభపడి 82, 559 దగ్గర ముగిసింది. నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 25, 278 దగ్గర ముగిసింది. సెన్సెక్స్ 83 వేల మార్కు దగ్గరలో ఉంది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83. 87 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Chiru – Balayya: సమరసింహారెడ్డి విత్ ఇంద్రసేనా రెడ్డి.. బాక్స్ ఆఫీస్ కి ఇన్సూరెన్స్ లు చేయించుకోలమ్మా!

నిఫ్టీలో బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ లాభాల్లో కొనసాగగా.. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, కోల్ ఇండియా మరియు నెస్లే ఇండియా నష్టపోయాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగియగా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం క్షీణించింది.

ఇది కూడా చదవండి: RSS: కుల గణన సున్నితమైన అంశం, ఎన్నికల ప్రయోజనం కోసం ఉపయోగించరాదు..



[ad_2]

Related Articles

Back to top button
Close
Close