Trending news

SS Thaman: ఫ్రెండ్స్ బాక్స్ లు కాళీ చేస్తున్నాడంటూ థమన్ మీద కంప్లైంట్స్

[ad_1]

  • తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో థమన్ మదర్ ప్రజెన్స్

  • తోటి పిల్లల టిఫిన్ బాక్స్ లు ఓపెన్ చేసి తినేసే వాడని కంప్లైంట్ లు: థమన్ మదర్

  • థమన్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్న థమన్ మదర్
SS Thaman: ఫ్రెండ్స్ బాక్స్ లు కాళీ చేస్తున్నాడంటూ థమన్ మీద కంప్లైంట్స్

SS Thaman Mother in Telugu Indian Idol 3: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో థమన్ మదర్ ప్రజెన్స్ ఆసక్తి రేకెత్తిస్తోంది. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రసవత్తరంగా జరుగుతోంది. ప్రతి వారం ఎపిసోడ్ అభిమానులకు థ్రిల్ పంచుతున్న క్రమంలో వారం వారం ఎలాంటి స్పెషల్స్ ఉండేలా చూసుకోవాలా? అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ మెగా మ్యూజిక్ షోలో మరో స్పెషల్ మూమెంట్ రానే వచ్చింది. ఈ షోకి జడ్జ్ గా ఉంటున్న సెన్సేషనల్ కంపోజర్ తమన్ అమ్మ గారు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందుకు సంబధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది.

Nani: ‘టైర్’ల గోల.. నన్ను వదిలేయండి ప్లీజ్!

ఇక షోలో థమన్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఘంటసాల సాయి శ్రీనివాస్ అలియాస్ థమన్ చిన్నప్పటి ముచ్చట్లు చెప్పారు. థమన్ చిన్నప్పుడు క్లాస్ రూమ్ లో కన్నా మైదానంలోనే ఎక్కువగా ఉండేవాడని, తనకు అసలు భయం లేదని, స్కూళ్లలో గొడవలు వచ్చేవని చెప్పారు. తోటి పిల్లల టిఫిన్ బాక్స్ లు ఓపెన్ చేసి తినేసే వాడని కంప్లైంట్ లు వుండేవని అలనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఐతే అతను హార్డ్ వర్కర్ చేస్తాడని, వర్క్ అయ్యే వరకు తిండి కూడా పట్టించుకోడని, సంగీతం – క్రికెట్ మించి తనకు మరో ప్రపంచం లేదని .. ఇలా చాలా సంగతులు చెప్పారు. ఈ ఎమోషనల్ అండ్ హార్ట్ టచ్చింగ్ ఎపిసోడ్ కోసం ఆహా లో శుక్రవారం,శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ని మిస్ అవ్వకండి అంటున్నారు.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close