Sri Lankan Navy: 8 మంది తమిళనాడు జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ

[ad_1]
- 8 మంది తమిళనాడు జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ..
-
అంతర్జాతీయ సముద్ర సరిహద్దు దాటినందుకు భారత జాలర్ల అరెస్ట్.. -
8 మంది మత్స్యకారులతో పాటు ఒక పడవను అదుపులోకి తీసుకున్న శ్రీలంక నేవీ..

Sri Lankan Navy: తమిళనాడులోని ఫిషింగ్ ఓడరేవును వదిలి శ్రీలంక సముద్ర జలాల్లో చేపల వేట కొనసాగిస్తున్న ఎనిమిది మంది మత్స్యకారులను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. మత్స్యకారులు తెల్లవారుజామున బయలుదేరి ధనుష్కోడి, తలైమన్నార్ సమీపంలో చేపలు పడుతుండగా అంతర్జాతీయ సముద్ర సరిహద్దు దాటినందుకు శ్రీలంక నేవీ పెట్రోల్ బోట్లు వారిని చుట్టుముట్టి.. ఎనిమిది మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకోవడంతో పాటు ఒక బోటును స్వాధీనం చేసుకున్నాయి.
Read Also: JC Prabhakar Reddy: తన అనుచరులకు జేసీ స్వీట్ వార్నింగ్.. వదిలిపెట్టను..!
ఇక, నిన్న రామేశ్వరం నుంచి 430 మెకనైజ్డ్ బోట్లు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లాయి. అందులో ఎనిమిది మంది సిబ్బందితో పాటు ఒక పడవను శ్రీలంక నావికాదళం పట్టుకున్నట్లు రామేశ్వరం ఫిషరీస్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రకటించారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దును దాటుతున్నారనే నెపంతో 72 రోజుల్లో శ్రీలంక నావికాదళం కనీసం 163 మంది మత్స్యకారులను అరెస్టు చేసింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చల అనంతరం అరెస్టైన మత్స్యకారులందరినీ బ్యాచ్‌ల వారీగా శ్రీలంక విడుదల చేస్తుంది. కాగా, ఇలాంటి అరెస్టుల వల్ల తమిళనాడులోని రామనాథపురం, నాగపట్నం, పుదుకోట్టైలోని మత్స్య పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందని.. శ్రీలంక, భారత్‌ల మధ్య దౌత్యపరమైన చర్చల ద్వారా శాశ్వత పరిష్కారం చూపాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.
[ad_2]
Source link