Singireddy Niranjan Reddy : కవితకు బెయిలు విషయంలో కాంగ్రెస్, బీజేపీలది అనైతిక వాదన

[ad_1]

కవిత బెయిల్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల స్పందనపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవితకు బెయిలు విషయంలో కాంగ్రెస్, బీజేపీలది అనైతిక వాదన అని ఆయన తెలిపారు. వీళ్ల రాజకీయం కోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద, న్యాయవాదుల మీద బురద జల్లుతున్నారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ మద్యం పాలసీ విషయంలో కవిత మీద మోపబడిన అభియోగాలకు ఎలాంటి నైతికత లేదు అని, కేవలం రాజకీయ కక్ష్యతో మోపబడిన కేసు ఇది అని ఆయన విమర్శించారు. దేశంలో కొట్లాడుతున్న జాతీయ రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ఒక్కటిగా పనిచేస్తున్నాయని, కేంద్రమంత్రి హోదాలో బండి సంజయ్, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రకటనలు సిగ్గుచేటు అన్నారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ వ్యాఖ్యల విషయంలో స్పందించాలని, మనీష్ సిసోడియా బెయిల్, కేజ్రివాల్ అరెస్ట్ విషయంలో నిందితులకు మద్దతు పలికిన కాంగ్రెస్ కవిత బెయిల్ విషయంలో నీచ రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రేవంత్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం స్పందించక పోవడం చూస్తుంటే ఆ పార్టీకి రేవంత్ తో సంబంధాలు ఉన్నయా ? లేవా ? అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
Actor Darshan: బళ్లారి జైలుకు వెళ్లిన తొలి సెలబ్రిటీ దర్శన్.. ఎందుకో తెలుసా?
[ad_2]