Shruti Haasan: సైలెంట్‌గా సంచలనాలు సృష్టిస్తూన్న సైలెంట్ కిల్లర్ శృతి హాసన్.!

[ad_1]
సైలెంట్ కిల్లర్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు శృతి హాసన్. ఫామ్‌లో లేనట్లే కనిపిస్తున్నారు కానీ ఏడాదికి ఈజీగా రెండు మూడు సినిమాలు చేస్తున్నారు.
తాజాగా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఈమె సొంతం అయిపోయింది. చాప కింద నీరులా వరస ప్రాజెక్ట్స్ సైన్ చేస్తూనే ఉన్నారు శృతి. అసలు శృతి నటిస్తున్న సినిమాలెన్ని.?
సైలెంట్‌గా సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నారు శృతి హాసన్. 2023లో తెలుగులోనే 4 సినిమాలు చేసారు ఈమె. పైగా అన్నీ విజయాలే కావడం గమనార్హం. జనవరిలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలో భాగమైన శృతి హాసన్..
డిసెంబర్లో హాయ్ నాన్న, సలార్ సినిమాలతో వచ్చారు. దానికి ముందు కూడా క్రాక్, వకీల్ సాబ్ లాంటి సినిమాలతో రచ్చ చేసారు ఈ బ్యూటీ. తెలుగులో మాత్రమే కాదు.. తమిళంలోనూ సత్తా చూపిస్తున్నారు శృతి హాసన్.
అంతేకాదు.. హాలీవుడ్ నుంచి కూడా ఈమెకు వరస ఆఫర్స్ వస్తున్నాయి. గతేడాది ‘ది ఐ’ అనే సినిమాలో నటించారు శృతి. తాజాగా చెన్నై స్టోరీలో ఈ భామకు ఛాన్స్ వచ్చింది.
సమంతను ముందు ఇందులో హీరోయిన్గా తీసుకున్నా.. ఆమె డేట్స్ సర్దుబాటు కాక శృతి వైపు వెళ్లారు దర్శక నిర్మాతలు. ఫిలిప్ జాన్ దర్శకత్వంలో చెన్నై స్టోరీ సినిమా వస్తుంది.
అలాగే సలార్ 2 కూడా లైన్లోనే ఉంది. తాజాగా యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్‌లో శృతి హాసన్ పేరు వినిపిస్తుంది. కీలక పాత్ర కోసం ఈమె పేరు పరిశీలిస్తున్నారు.
ఈ రేంజ్లో బిజీగా ఉన్నారు కాబట్టే.. ఈ మధ్యే అడివి శేష్ డెకాయిట్ నుంచి డేట్స్ అడ్జస్ట్ కాక తప్పుకున్నారు శృతి హాసన్. మొత్తానికి చాప కింద నీరులా దూసుకుపోతున్నారు ఈ భామ.
[ad_2]