Trending news

Shivam Bhaje: అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన శివం భజే.. ఎక్కడ చూడొచ్చంటే..

[ad_1]

Shivam Bhaje: అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన శివం భజే.. ఎక్కడ చూడొచ్చంటే..

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ దూసుకుపోతోంది. సినిమాలతో పాటు ఆకట్టుకునే వెబ్ సిరీస్‌లు, గేమ్ షోలు, టాక్ షోలతో ప్రేక్షకులను అలరిస్తోంది ఆహా. ఇప్పటికే ఆహాలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ మూవీ ఆహాలోకి వచ్చేసింది. ఆ సినిమానే అశ్విన్ బాబు లేటెస్ట్ మూవీ శివం భజే. ‘హిడింబ‌’ త‌ర్వాత అతడు న‌టించిన చిత్ర‌మిది. ఈ సినిమా మంచి అంచనాల మధ్య విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కెరీర్ బిగినింగ్ నుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు అశ్విన్ బాబు. అలాగే శివం భజే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆగస్టు 1న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ నెలలోపే ఓటీటీలోకి వచ్చేసింది.

ఇది కూడా చదవండి : పెళ్లైన ముగ్గురితో ఎఫైర్స్.. వారిలో క్రికెటర్ కూడా.. ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే

ఈ సినిమాలో అశ్విన్‌బాబు న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. యాక్ష‌న్ స‌న్నివేశాల్లోనూ అదరగొట్టాడు అశ్విన్ బాబు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరో చిన్న తనంలోనే తండ్రిని కోల్పోతాడు. అప్పటి నుంచి తల్లిని, చెల్లిని చూసుకుంటుంటాడు. పెరిగి పెద్దయిన తర్వాత అనుకోకుండా ఓ గొడవలో చూపు కోల్పోతాడు. ఆతర్వాత అతనికి ట్రాన్స్‌ప్లాంటేష‌న్ జరుగుతుంది. ఆ తర్వాత అతని రెండు హత్యలకు సంబందించిన జ్ఞాపకాలు మైండ్ లో కదలాడుతూ ఉంటాయి.

ఇది కూడా చదవండి : తస్సాదియ్యా..! మేం వయసుకు వచ్చాం హీరోయిన్ను చూశారా.? మెంటలెక్కించిందిగా.!

దాంతో డాక్టర్స్ ను సంప్రదిస్తే.. జీనో ట్రాన్స్‌ప్లాంటేష‌న్ వ‌ల్లే ఆ స‌మ‌స్య అని తేలుతుంది. అసలు జీనో ట్రాన్స్‌ప్లాంటేష‌న్  ఏంటి.? హీరోకి గుర్తుకు వస్తున్న హత్యలు ఎవరివి.? వాటివెనక ఉన్న కథ ఏంటి.? అనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాలో కథ కథనం ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో అశ్విన్‌బాబుకు జోడీగా దిగంగన సూర్యవన్షీ నటించింది. హైపర్‌ ఆది, బ్రహ్మాజీ, తనినికెళ్ల భరణి తదితరులు ఇతర పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆహా ఓటీటీలో ఈ సినిమాను చూసేయండి.

 

View this post on Instagram

 

A post shared by ahavideoin (@ahavideoin)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close