Trending news

Shakeela: మహిళా ఆర్టిస్టులపై లైంగిక వేధింపుల పై షకీలా షాకింగ్ కామెంట్స్..

[ad_1]

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళా ఆర్టిస్టులపై లైంగిక వేధింపులు, దాడి ఘటనలపై రిటైర్డ్ మహిళా న్యాయమూర్తి హేమ నేతృత్వంలోని కమిటీ  ఇచ్చిన నివేదిక చూసి దేశం మొత్తం షాక్ అయ్యింది. చాలా మంది దీని పై మాట్లాడారు. తాజాగా నటి షకీలా కూడా మాట్లాడారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘మలయాళ చిత్ర పరిశ్రమలో లాగానే తమిళ చిత్రసీమలో కూడా మహిళా ఆర్టిస్టులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. అలాగే తెలుగు ఇండస్ట్రీలోనూ లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. హిందీ సినిమా విషయానికొస్తే అక్కడికి వెళ్లిన వెంటనే అందరూ స్నేహితులవుతారు. కాబట్టి వారికి దీనికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే బాలీవుడ్‌లో వారసత్వ సమస్య ఉంటుంది అని చెప్పుకొచ్చారు షకీలా.

సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు చాలానే జరుగుతున్నాయి. కొంతమంది దీని పై మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది బయటపడటం లేదు.  కమిట్మెంట్ అడిగేవారు మనకు అడుగడుగునా కనిపిస్తారు. నేను ఇది చేయలేను   అని మీరు గట్టిగా చెప్పినప్పుడు సమస్య రాదు. కాబట్టి ఈ విషయంలో పురుషులకు సరైన హెచ్చరిక ఇవ్వాలి. కఠిన చర్యలు తీసుకోవాలని షకీలా అన్నారు.

ఇది కూడా చదవండి : Heroine Simran : సిమ్రాన్ కొడుకుని చూశారా.? హాలీవుడ్ హీరోలా ఉన్నాడే..

కొన్ని సంవత్సరాల క్రితం, మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళా నటీమణులు పై లైంగిక వేధింపులపై విచారణకు ఆదేశించింది కోర్టు. దీనికి సంబంధించి కేరళ ప్రభుత్వం రిటైర్డ్ మహిళా న్యాయమూర్తి హేమ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నివేదిక ఐదేళ్ల క్రితం కేరళ ప్రభుత్వానికి సమర్పించగా.. ఇప్పటికీ బయటకు పూర్తిగా రాలేదు. బయటకు వచ్చిన కొన్ని విషయాలే ఇప్పుడు ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి.

ఇది కూడా చదవండి : Devara: ఫ్యాన్స్‌కు స‌డెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన దేవర టీమ్.. జాన్వీతోపాటు మరో హీరోయిన్ కూడా..

కేరళ నటీమణులు తమ డిమాండ్‌లను పాటించకుంటే ప్రముఖ సినీనటులు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని, అలాగే తదుపరి సినిమాల్లో అవకాశాలు ఇచ్చేవారు కాదని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు హేమ నివేదిక ఏర్పాటు చేయడం మరికొంతమంది నటీమణులు కూడా మలయాళ సినీ పరిశ్రమలోని ప్రముఖలపై లైంగిక ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో మలయాళ నటీనటుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న నటుడు మోహన్ లాల్ సహా సంఘం కార్యవర్గ సభ్యులు 17 మంది రాజీనామా చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

[ad_2]

Related Articles

Back to top button
Close
Close