Top newsTrending news

Sbi బంపర్ ఆఫర్ 45 నిమిషాల్లో రెండు లక్షల రూపాయల లోన్ ఇస్తుంది 6 నెలల వరకు No EMI

Sbi Bumper Offer Offers Loan of Rs 2 Lakh in 45 Minutes No EMI for 6 months

భువనేశ్వర్‌:కరోనా లాక్‌డౌన్‌ ప్రభావం మధ్యతరగతి ప్రజలపై ఎక్కువగా చూపిస్తోంది. కొంతమంది ప్రజలకు పూట గడవడమే కష్టంగా మారింది. ఈ కష్ట్టమయంలో మధ్యతరగతి ప్రజలను ఆదుకునేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ముందుకొచ్చింది. వీరి కోసం ప్రీ అఫ్రూన్ట్‌ పర్సనల్‌ లోన్‌ లేదా ఎమర్జెన్సీ లోన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఎమర్జెన్సీ లోన్‌ను ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండానే… 45 నిమిషాల్లో అందించనున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది. ఈ లోన్‌కు ఆరు నెలల వరకు ఈఎంఐ విధించకపోవడం విశేషం. అంటే మే నెలలో ఈ లోన్‌ తీసుకుంటే, అక్టోబర్‌ వరకు ఎలాంటి ఈఎంఐ కట్టాల్సినవసరం లేదు. ఆరు నెలల తర్వాత ఈ ఈఎంఐ పేమెంట్‌ మొదలవుతుంది. ఏ సమయంలోనైనా పర్సనల్‌ ఎమర్జెన్సీ లోన్‌ను తీసుకోవచ్చని ఎస్‌బీఐ చెప్పింది. కరోనా లాక్‌డౌన్‌ కాలంలో ఇబ్బంది పడుతోన్న ప్రజల కోసం దీన్ని తెచ్చినట్టు ఎస్‌బీఐ తెలిపింది. ఈ ఎమర్జెన్సీ లోన్‌కు ఏడాదికి 7.25 శాతం వడ్డీ వేయనుంది. ఇది సాధారణంగా పర్సనల్‌ లోన్స్‌పై ఇచ్చే విధించే వడ్డీ కంటే చాలా తక్కువ. ప్రస్తుతం ఎస్‌బీఐ పర్సనల్‌ లోన్స్‌ 10.5 శాతం నుంచి 22 శాతం వరకు ఉన్నాయి.

పర్సనల్‌ ఎమర్జెన్సీ లోన్‌ అప్లయి చేయడమెలా…? మీ రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌ నుంచి పీఏపీఎల్‌ అని రాసి స్పేస్‌ ఇచ్చి, మీ అకౌంట్‌ నెంబర్‌ చివరి నాలుగు నెంబర్లు రాసి, 567676కి ఎస్‌ఎంఎస్‌ చేయాలి. ఇలా పంపాక మీరు పర్సనల్‌ ఎమర్జెన్సీ లోన్‌కు అర్హులో కాదో బ్యాంక్‌ చెబుతుంది. నాలుగు ప్రాసెస్‌లో అర్హులైన వారికి లోన్‌ వస్తుంది. యోనో ఎస్‌బీఐ యాప్‌లో కూడా అవైల్‌ నౌ అప్పన్లను క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత లోన్‌ టెన్యూర్‌ను, అమైంట్‌ను సెలక్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్‌ చేస్తే. మీ అకౌంట్‌లోకి ఆటోమేటిక్‌గా మనీ క్రెడిట్‌ అవుతుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close