Santoor Scholarships: వాహ్ సంతూర్.. విద్యార్థినులకు “స్కాలర్‌షిప్పులు”.. అకౌంట్లో ప్రతినెలా రూ. 2000

[ad_1]
- విద్యార్థినులకు సంతూర్ స్కాలర్‌షిప్పులు
- అకౌంట్లో ప్రతినెలా రూ. 2000
- లింక్ కింద ఉంది ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

ఎంత అభివృద్ధి చెందినా… పల్లెల్లో ఇంకా యువకు ఉన్నత విద్యాకు దూరమవుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్నిరకాలుగా అవగాహన కల్పించిన స్వల్ప మార్పే కనిసిస్తోంది. గతం కంటే అధ్వానంగా లేకపోయినప్పటికీ … ఇప్పుడు కూడా పల్లెల్లో ఆర్థిక పరిస్థితి కారణంగా చదువకు దూరమవుతున్నా యువతులు ఉన్నారు. ప్రతిభ ఉండి కూడా ఆర్థిక పరిస్థితి బాగా లేక చదువుకు దూరమవుతున్న విద్యార్థినులకు కోసం విప్రో సంస్థ సంతూర్ ఉపకారవేతనాలను అందిస్తోంది. ఆర్థికంగా ఆదుకొని, చదువులో రాణించేలా ప్రోత్సహించడానికి వీలు కల్పిస్తోంది. ఈ ఉపకార వేతనాలకు ఇంటర్మీడియట్ పూర్తిచేసి, యూజీ కోర్సుల్లో చేరిన బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు.
READ MORE: Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8.. ఎవర్రా మీరంతా? అనుకోకుండా ఉండలేరు!
గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల బాలికల విషయంలో ఆర్థిక ప్రోత్సాహం అందిస్తే వారు అత్యున్నత స్థాయికి చేరుకోవడం ఏ మాత్రమూ కష్టం కాదని విప్రో సంతూర్ గుర్తించింది. వీటిని విప్రో కేర్స్, విప్రో కన్సూమర్ కేర్ అండ్ లైటెనింగ్ గ్రూప్ కలిసి అందిస్తున్నాయి. ఇవి 2016-2017 విద్యా సంవత్సరం నుంచే ప్రారంభమయ్యాయి. కానీ అవగాహనా రాహిత్యం వల్ల చాలా మంది వీటి గురించి తెలియలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ ఈ నాలుగు రాష్ట్రాల నుంచి ఈ ఏడాది 1500 మందికి ఈ
ప్రోత్సాహకాలు అందిస్తారు. వీళ్ల ప్రోత్సహకాలు తీసుకుని గత ఎనిమిదేళ్లలో 8000 మంది విద్యార్థినులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చదువుతున్నారు. ఉన్నత విద్యలో ప్రతిభ సాధిస్తున్నారు. హ్యుమానిటీస్, లిబరల్ ఆర్ట్స్, సైన్స్ కోర్సుల్లో చేరినవారికి, వెనుకబడిన జిల్లాలకు చెందినవారికి ఎంపికలో కొంత ప్రాధాన్యం ఉంటుందని సంస్థ పేర్కొంది. అకడమిక్ మెరిట్ ప్రాతిపదికన అర్హులను ఎంపిక చేస్తారు.
READ MORE: Modi-Biden telephonic call: పీఎం మోడీ, వైట్ హౌస్ పరస్పర విరుద్ధ ప్రకటన..
దరఖాస్తు చేసుకోండిలా..
పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే చదివుండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ లకు చెందిన పేద బాలికలే ఈ స్కాలర్‌షిప్పులకు అర్హులు. 2023-24 విద్యాసంవత్సరంలో ఇంటర్ లేదా సమాన స్థాయి కోర్సులు పూర్తిచేయాలి. అలాగే 2024-25లో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ మొదటి సంవత్సరం కోర్సుల్లో చేరి ఉండాలి. కనీసం మూడేళ్లు, ఆపై వ్యవధితో ఉన్న డిగ్రీ కోర్సుల్లో చేరినవారే ఈ స్కాలర్‌షిప్పు పొందడానికి అర్హులు. ఎంపికైన విద్యార్థినులకు మూడేళ్లు లేదా కోర్సు పూర్తయినంతవరకు ప్రతి నెలా రూ.2000 చొప్పున ప్రోత్సాహం అందిస్తారు. డబ్బు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమవుతుంది. ట్యూషన్ ఫీ, పుస్తకాలు, ఇతర సదుపాయాల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు.
READ MORE: Mohanlal : హేమ కమిటీ కలకలం.. మోహన్ లాల్ సంచలన నిర్ణయం
ఇలా దరఖాస్తు చేసుకోండి..
ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. పాస్‌పోర్టు సైజు ఫొటో, కాలేజీ ఐడీ కార్డు, పది, ఇంటర్ మార్కుల పత్రాలు వీటిని అప్‌లోడ్ చేయాలి. లేదా దరఖాస్తు ఫారాన్ని సంస్థ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింటవుట్ తీసుకోవాలి. అందులో పూర్తి వివరాలను నింపి, అవసరమైన పత్రాలు జతచేసి పోస్టు ద్వారా పంపాలి. దరఖాస్తు ఫీజు లేదు. సెప్టెంబరు 20 వరకు సమయం ఉంది. www.santoorscholarships.com సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి.. సెప్టెంబర్ 20 వరకే అవకాశం.
[ad_2]
Source link