Sampath Ram: సలార్ నటుడికి రోడ్డు ప్రమాదం.. ఏమైందంటే?

[ad_1]
- సలార్ నటుడికి రోడ్డు ప్రమాదం
-
చెన్నై గిండి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారుకి ప్రమాదం -
సంపత్ రామ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు

సంపత్ రామ్ తమిళ సినిమాలలో విలన్ – క్యారెక్టర్ రోల్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దూరదర్శన్‌లో ప్రసారమైన ‘ఎతనై భన్ని’ సీరియల్‌తో తన నట జీవితాన్ని ప్రారంభించి, 1999లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ముత్యాలవన్’ చిత్రంలో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా నటించి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో సంపత్ రామ్ ఎక్కువగా పోలీసు పాత్రలలో, విలన్‌గా నటించాడు.
Bolisetti Srinivas: అల్లు అర్జున్ కు, మా పార్టీకి ఎలాంటి శత్రుత్వం లేదు!
తెలుగులో స్పైడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయన అరణ్య, 1945, నేనేనా సినిమాలతో పాటు ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాలో వేద పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పటి వరకు 75కి పైగా తమిళ చిత్రాల్లో నటించిన సంపత్ రామ్ ఇటీవల విడుదలైన తమిళ చిత్రం ‘తంగలాన్’లోనూ ప్రధాన పాత్ర పోషించారు. ఇక చెన్నై గిండి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వెనుక వచ్చిన లారీ ఢీకొనడంతో కారు వెనుక భాగం నుజ్జునుజ్జు కాగా, కారులో ప్రయాణిస్తున్న సంపత్ రామ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడని తెలుస్తోంది.
[ad_2]