Samit Dravid: టీమిండియా U19కు సెలెక్ట్ అయిన సమిత్ ద్రవిడ్..

[ad_1]
- రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ అండర్-19 సిరీస్ లో భారత జట్టుకు ప్రాతినిధ్యం.
- దేశీయ స్థాయిలో అతను స్థిరంగా పరుగులు.
- ఈ సిరీస్ లో భాగంగా మూడు 50 ఓవర్ల మ్యాచ్లు
- రెండు నాలుగు రోజుల మ్యాచ్లు ఉంటాయి.

Samit Dravid: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ ఆస్ట్రేలియాతో జరగబోయే అండర్-19 సిరీస్ లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. 18 ఏళ్ల ఆల్ రౌండర్ వన్డే, 2 నాలుగు రోజుల మ్యాచ్ లు ఆడబోయే జట్లలో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఎంపిక దేశీయ స్థాయిలో సమిత్ అద్భుతమైన ప్రదర్శన తర్వాత వచ్చింది. దేశీయ స్థాయిలో అతను స్థిరంగా పరుగులు సాధించాడు. అండర్-19 ఈ సిరీస్ లో భాగంగా మూడు 50 ఓవర్ల మ్యాచ్లు, రెండు నాలుగు రోజుల మ్యాచ్లు ఉంటాయి. ఈ మ్యాచ్లు వరుసగా పుదుచ్చేరి, చెన్నైలో జరగనున్నాయి. వన్డే జట్టుకు మహ్మద్ అమన్ నాయకత్వం వహిస్తుండగా, నాలుగు రోజుల జట్టుకు సోహమ్ పట్వర్ధన్ నాయకత్వం వహించనున్నారు.
రెండు జట్లలో సమిత్ కు అవకాశం దక్కింది.
Jr. Ntr – Bunny : అల్లు అర్జున్, ఎన్టీఆర్ మెచ్చిన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
సమిత్ తన స్థిరమైన రన్ స్కోరింగ్ సామర్థ్యంతో దేశీయ క్రికెట్లో రికార్డులను సృష్టిస్తున్నాడు. మహారాజా ట్రోఫీ కెఎస్సిఎ టి20లో అతని ఇటీవలి ప్రదర్శనలు దేశవ్యాప్తంగా క్రికెట్ ఔత్సాహికుల దృష్టిని ఆకర్షించాయి. ఈ టోర్నమెంట్లో అతని కొన్ని పెద్ద హిట్ల వీడియోలు వైరల్ అయ్యాయి. ఇకపోతే., అండర్-19 క్రికెటర్ల కోసం నాలుగు రోజుల ఫార్మాట్ టోర్నమెంట్ 2024 కూచ్ బెహార్ ట్రోఫీలో కర్ణాటక విజయానికి సమిత్ కీలక పాత్ర పోషించారు. అతను ముంబైతో జరిగిన ఫైనల్లో రెండు వికెట్లతో సహా మొత్తంగా ఎనిమిది మ్యాచ్లలో 362 పరుగులు చేసి 16 వికెట్లు పడగొట్టాడు. సమిత్ కుడిచేతి వాటం పేసర్, అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కూడా.
Helicopter Crash: కేదార్‌నాథ్‌లో కూలిపోయిన హెలికాప్టర్..
ఇకపోతే., సమిత్ 2005 అక్టోబర్ 11న బెంగళూరులో జన్మించారు. తన తండ్రి అడుగుజాడలను అనుసరించాలనుకుంటాడు. రాహుల్ ద్రవిడ్ తన 16 ఏళ్ల కెరీర్లో టెస్టుల్లో 13,288 పరుగులు, వన్డేల్లో 10,889 పరుగులు చేశాడు. అతను ప్రపంచవ్యాప్తంగా అత్యంత గౌరవనీయమైన ఆటగాళ్ళలో ఒకడు. ఇక భారతదేశ విజయానికి అపారమైన సహకారం అందించిన వారిలో ప్రముఖుడు. ఈ ఏడాది ప్రారంభంలో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ను గెలుచుకున్న భారత జట్టుకు ద్రవిడ్ ప్రధాన కోచ్ గా కూడా సేవలను అందించాడు.
[ad_2]