Rescue Operation: బాపట్ల జిల్లా లంక గ్రామాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు..

[ad_1]
- బాపట్ల జిల్లా లంక గ్రామాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు..
-
లోతట్టు ప్రాంతాల్లో గ్రామస్తులు ఎవరు ఇళ్లల్లో ఉండొద్దు: మంత్రి గొట్టిపాటి రవి -
బాధితులకు ఫుడ్ ప్యాకెట్లతో పాటు మందుల కిట్ అందిజేస్తున్నాం: స్పెషల్ సీఎస్ కృష్ణబాబు

Rescue Operation: బాపట్ల జిల్లాలోని లంక గ్రామాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొల్లూరు దిగువ భాగంలో ఉన్న లంక గ్రామాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల జిల్లా కలెక్టర్ మురళీకృష్ణ, ఎస్పీ తుషార్ డ్యూడితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లంక లోతట్టు ప్రాంతాల్లో గ్రామస్తులు ఎవరు ఇళ్లల్లో ఉండొద్దు… లోతట్టు ప్రాంతాల ప్రజలు, పునరావాస కేంద్రాలకు చేరుకోవాలి… ప్రకాశం బ్యారేజ్ నుండి 12 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో ప్రమాదం పొంచి ఉంది…. ప్రభుత్వం సాధ్యమైనంత వరకు బాధితులకు సహాయం చేస్తుంది.
Read Also: AP and Telangana Rains LIVE UPDATES: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు.. లైవ్ అప్‌డేట్స్
అలాగే, భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపునకు గురైన విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో ఫుడ్ ప్యాకెట్లతో పాటు అత్యవసర మందుల కిట్లను వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు పంపిణీ చేస్తున్నారు. 14 మెడికల్ రిలీఫ్ క్యాంపుల్లో అత్యవసర మందుల కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. మెడికల్ రిలీఫ్ క్యాంపుల్లో 24 గంటలూ వైద్య సేవలందించేందుకు డాక్టర్లు, సిబ్బంది నియామకం చేపట్టినట్లు పేర్కొన్నారు. అందుబాటులో సరిపడా మందులు.. అత్యవసర మందుల కిట్‌లో ఆరు రకాల మందులతో పాటు ఎలా వాడాలన్న వివరాలతో కరపత్రాల పంపిణీ చేస్తున్నారు. బోట్ల ద్వారా అందజేసే ఫుడ్ ప్యాకెట్లతో పాటు అత్యవసర మందుల కిట్లను అందిస్తున్నారు. ఆరోగ్య సమస్యల విషయంలో ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.. రేయింబవళ్లూ సేవలందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పెషల్ సీఎస్ కృష్ణబాబు ఆదేశించారు.
[ad_2]